మీ స్నేహాన్ని ఎన్నటికీ మరువలేం.. భారతీయులకు ఇరాన్ కృతజ్ఞతలు

మీ స్నేహాన్ని ఎన్నటికీ మరువలేం.. భారతీయులకు ఇరాన్ కృతజ్ఞతలు

టెహ్రాన్/ న్యూఢిల్లీ: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ మరణం పట్ల భారతదేశం ప్రదర్శించిన సానుభూతి, అంత్యక్రియలలో పాల్గొని చాటిన సంఘీభావంపై ఇరాన్ ప్రభుత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. ఈ విషాదకర సమయంలో భారత్ చూపిన మద్దతు, ఇరు దేశాల మధ్య ఉన్న దశాబ్దాల చారిత్రక, సాంస్కృతిక సంబంధాలకు నిదర్శనమని ఇరాన్ ఎంబసీ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. 

ఖమేనీ మరణం తమ దేశానికి తీరని లోటని పేర్కొన్న ఇరాన్, ‘ఈ క్లిష్ట సమయంలో భారతదేశం వ్యక్తం చేసిన కరుణ, స్నేహపూర్వక వైఖరి తమకు ఎంతో ఊరటనిచ్చింది. ఈ స్నేహ బంధాన్ని ఇరాన్ ప్రజలు ఎన్నటికీ మరువలేరు’ అని ఎంబసీ స్పష్టం చేసింది. ఈ ఘటన రెండు దేశాల మధ్య ఉన్న దృఢమైన మైత్రిని ప్రపంచానికి చాటిచెప్పిందని పేర్కొంది.