గర్భిణి భార్యపై భర్త లైంగిక దాడి.. అసహజ పద్ధతిలో శృంగారం

గర్భిణి భార్యపై భర్త లైంగిక దాడి.. అసహజ పద్ధతిలో శృంగారం

అబిడ్స్, వెలుగు: గర్భిణి అయిన భార్యపై అసహజ లైంగిక దాడి చేసిన భర్తకు  నాంపల్లి ఐదో అడిషనల్​సెషన్స్ జడ్జి ఐదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ కీలక తీర్పు ఇచ్చారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ కథనం ప్రకారం.. నందిముస్లాయిగూడలో టైలర్​గా పని చేసే ఓ వ్యక్తికి పెండ్లయ్యింది.

ఇతడి భార్య గర్భవతి.. అయితే, ఆమె ఇష్టానికి విరుద్ధంగా అసహజ పద్ధతిలో లైంగిక దాడి చేస్తున్నాడు. ఒప్పుకోకపోవడంతో అప్పుడప్పుడు కడుపుపై కొడుతున్నాడు. వేధింపులు భరించలేక ఆమె ఫిర్యాదు చేయడంతో బహదూర్‌పురా పీఎస్​లో కేసు నమోదైంది. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి కె. అజేశ్​కుమార్ నిందితుడిని దోషిగా నిర్ధారించి ఐదేండ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేలు ఫైన్ ​వేశారు.