ఖమ్మంలో జులై 10న సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ

ఖమ్మంలో జులై 10న సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ

తెలంగాణలో రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం మరో భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. జులై 10వ తేదీన ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో ప్రతిష్టాత్మక ‘రైతు ఆశీర్వాద సభ’ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న ఈ భారీ సభలో  సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ క్రమంలో జులై 7న  సాయంత్రం రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభాస్థలాన్ని స్వయంగా పరిశీలించారు.. సభకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను రికార్డ్ స్థాయిలో అందజేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం ఏడు రోజుల్లోనే ఏకంగా 7,491 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామని ఆయన స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఇదే నిదర్శనమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.