ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫుట్‌బాల్ చరిత్రలో అత్యంత బలమైన జట్లలో ఒకటైన పోర్చుగల్ ప్రయాణం విషాదకరంగా ముగిసింది. రౌండ్ ఆఫ్ 16లో భాగంగా మంగళవారం (జులై 7) హోరాహోరీగా జరిగిన పోరులో పోర్చుగల్‌పై 1-0 తేడాతో స్పెయిన్ విజయం సాధించింది. సెకండాఫ్ అదనపు సమయంలో ప్రత్యామ్నాయ ఆటగాడు మికెల్ మెరినో చేసిన ఏకైక గోల్‌తో స్పెయిన్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.
ఈ ఓటమితో పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. స్పెయిన్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. దీంతో పోర్చుగల్‌కు అందని ద్రాక్షగా మిగిలిన ఫిఫా వరల్డ్ కప్ అందించాలన్న ఆ దేశ దిగ్గజ ఆటగాడు క్రిస్ట్రియానో రొనాల్డో చిరకాల వాంఛ నేరవేరలేదు. ఎందుకంటే.. ఈ టోర్నీకి ముందే తనకు ఇదే వరల్డ్ కప్ అని రొనాల్డో ప్రకటించిన విషయం తెలిసిందే. సో.. నెక్ట్స్ ఫిఫా వరల్డ్ కప్‌లో ఈ దిగ్గజ ఆటగాడిని చూడలేం.
స్పెయిన్‌పై ఓటమి అనంతరం తన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాననే బాధతో రొనాల్డో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. స్టేడియంలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ఆటతో ఫుట్‌బాల్‌లో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రొనాల్డో.. తన చిరకాల వాంఛ నేరవేరకుండానే కన్నీళ్లతో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకడం సగటు ఫుట్‌బాల్ అభిమానిని బాధించింది.
