క్యాడీ క్లాష్‌‌–2026 టోర్నీలో గ్రాస్‌‌ విన్నర్‌‌గా ప్రేమ్‌‌, మహమూద్‌‌

క్యాడీ క్లాష్‌‌–2026 టోర్నీలో గ్రాస్‌‌ విన్నర్‌‌గా ప్రేమ్‌‌, మహమూద్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: టీ గోల్ఫ్‌‌ ఆధ్వర్యంలో బౌల్డర్‌‌ హిల్స్‌‌ గోల్ఫ్‌‌ అండ్‌‌ కంట్రీ క్లబ్‌‌లో జరిగిన ‘క్యాడీ క్లాష్‌‌–2026’ టోర్నీలో ప్రేమ్‌‌ (బెప్టా, 75 పాయింట్లు), మహమూద్‌‌ (హెచ్‌‌జీఏ, 76) గ్రాస్‌‌ విన్నర్‌‌గా నిలిచారు. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో కేటగిరీ–ఎ (హ్యాండిక్యాప్‌‌ 0-12)లో షా ఫైసల్‌‌ (హెచ్‌‌జీఏ) 35/21, నరసింహా (బెప్టా) 35/20 స్కోరుతో విజయం సాధించారు. 

కేటగిరీ–బి (హ్యాండిక్యాప్ 12+)లో మేఘ్‌‌నాథ్ (బెప్టా) -33, విష్ణు (హెచ్‌‌జీఏ) -32, క్లోజెస్ట్ టు ద పిన్‌‌గా జి. మహేశ్ (2 అడుగుల 10 అంగుళాలు), స్ట్రెయిటెస్ట్ డ్రైవ్ విభాగంలో ఆసిఫ్ (2 అంగుళాలు), లాంగెస్ట్ డ్రైవ్‌‌లో టి. సాయి (351 యార్డులు) విజేతలుగా నిలిచారు. 

నగరంలోని ప్రముఖ క్లబ్‌‌లకు చెందిన 140 మంది పైగా క్యాడీలు ఇందులో పాల్గొన్నారు. స్టేబుల్‌‌ఫోర్డ్ ఫార్మాట్, డబుల్ పీరియా పద్ధతిలో ఈ పోటీలను నిర్వహించారు. హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్‌‌జీఏ), బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ అండ్ కంట్రీ క్లబ్, బెప్టా, హల్ది వంటి ప్రముఖ క్లబ్‌‌ల క్యాడీలు ఇందులో తలపడ్డారు.