లండన్: ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ అలెక్స్ డి మినార్‌కు వింబుల్డన్ ప్రిక్వార్టర్స్‌లోనే చుక్కెదురైంది. సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్‌లో ఐదోసీడ్ డి మినార్ 5–7, 6–7 (4/7), 3–6తో ఫ్లావియో కోబలి (ఇటలీ) చేతిలో కంగుతిన్నాడు. 2 గంటలా 34 నిమిషాల మ్యాచ్‌లో కోబలి అటాకింగ్ గేమ్‌తో ఆకట్టుకున్నాడు. తన సర్వీస్‌లో 76 శాతం పాయింట్లు సాధించిన కోబలి 3 ఏస్‌లు, 5 డబుల్ ఫాల్ట్స్ చేశాడు. 6 బ్రేక్ పాయింట్లను కాచుకున్నాడు. 24 విన్నర్లు, 33 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేశాడు.
5 ఏస్‌లు, 5 డబుల్ ఫాల్ట్స్ చేసిన డి మినార్ సర్వీస్ పాయింట్లు రాబట్టడంలో ఫెయిలయ్యాడు. 4 బ్రేక్ పాయింట్లను మాత్రమే కాపాడుకున్నాడు. 24 విన్నర్లు కొట్టినా 40 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో మూల్యం చెల్లించుకున్నాడు. విమెన్స్ సింగిల్స్ పౌలిని (ఇటలీ) 6–4, 4–6, 6–3తో ఈలా (చెక్)పై, కోస్టుక్ (ఉక్రెయిన్) 6–4, 6–4తో క్రుగెర్ (అమెరికా)పై, ఎలైస్ మార్టెన్స్ (బెల్జియం) 6–4, 6–4తో బౌజుకోవా (చెక్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.
