గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌లో మూడో స్థానంలో ప్రజ్ఞానంద

గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌లో మూడో స్థానంలో ప్రజ్ఞానంద

జాగ్రెబ్‌‌ (క్రొయేషియా): ఇండియా గ్రాండ్‌‌ మాస్టర్‌‌ ఆర్‌‌. ప్రజ్ఞానంద గ్రాండ్‌‌ చెస్‌‌ టూర్‌‌లో ఆకట్టుకున్నాడు. సోమవారం ముగిసిన ఈ టోర్నీలో చివరి రోజు అద్భుతంగా ఆడాడు. తొలి గేమ్‌‌లో విన్సెంట్‌‌ కీమర్‌‌ చేతిలో ఓడిన ప్రజ్ఞా.. తర్వాత జరిగిన ఎనిమిది గేమ్‌‌ల్లో ఆరు పాయింట్లు సాధించాడు. ఈ క్రమంలో గుకేశ్‌‌ చేతిలో ఓడిన ప్రజ్ఞానంద.. అలీరెజా ఫిరౌజాను ఓడించడం విశేషం. 

ఓవరాల్‌‌గా ప్రజ్ఞానంద 21.5 పాయింట్లతో సంయుక్తంగా మూడో ప్లేస్‌‌లో నిలిచాడు. వరల్డ్‌‌ చాంపియన్‌‌ డి. గుకేశ్‌‌ 18.5 పాయింట్లతో ఆరో ప్లేస్‌‌తో సరిపెట్టుకున్నాడు. ఆఖరి రోజున 5 పాయింట్లు సాధించిన అలీరెజా ఫిరౌజా 23.5 పాయింట్లతో టైటిల్‌‌ను కైవసం చేసుకున్నాడు. నొడిర్బెక్‌‌ అబ్దుసత్తారోవ్‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌) 23.5 పాయింట్లు సాధించినా.. టైబ్రేక్‌‌లో అలీరెజా మెరుగ్గా ఆడాడు.