MS Dhoni Birthday: భారత క్రికెట్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్, లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీ ఈరోజు తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ 'తలా'కు బర్త్‌డే విషెస్ చెప్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ధోనీ కొత్త లుక్ కోసం ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న టైంలో.. ఆయనకు సంబంధించిన ఒక పాత క్యూట్ వీడియో ఇప్పుడు నెట్టింట మళ్లీ ట్రెండ్ అవుతోంది.
కుక్కలతో ధోనీ బర్త్‌డే సెలబ్రేషన్స్:
నిజానికి ఈ వైరల్ వీడియో 2023 బర్త్‌డే సమయానిది. అప్పట్లో ధోనీ స్వయంగా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎంత పెద్ద స్టార్ అయినా.. ధోనీ లైఫ్ స్టైల్ ఎంత సింపుల్‌గా ఉంటుందో చెప్పడానికి ఈ వీడియోనే పక్కా ఉదాహరణ. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా, గ్రాండ్ సెలెబ్రేషన్స్‌కు దూరంగా.. ధోనీ తన సొంత ఇంట్లో, తన పెంపుడు కుక్కల మధ్య పుట్టిన రోజు వేడుకలని సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇక వీడియోలో చూస్తే.. ధోనీ తన ఇంటి గార్డెన్‌లో ఒక చిన్న కేక్ ముందు నిలబడి ఉండగా.. ఆయన పక్కనే సామ్, లిల్లీ, గబ్బర్, జోయా అనే నాలుగు పెంపుడు కుక్కలు డిసిప్లిన్‌గా కూర్చొని.. మహీ భాయ్ కేక్ కట్ చేసి, ఆ ముక్కలను ఎంతో ప్రేమగా వాటికి తినిపించారు. అవి కూడా తొందరపడకుండా ఎంతో పద్ధతిగా తిన్నాయి.
మహీ భాయ్ హార్ట్ టచింగ్ క్యాప్షన్:
మూడేళ్ల క్రితం ఈ వీడియోను పోస్ట్ చేసినప్పుడు మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు థాంక్స్ చెప్తూ ఒక హార్ట్ టచింగ్ క్యాప్షన్ పెట్టారు. నాకు విరామం లేకుండా బర్త్‌డే విషెస్ చెప్పిన అందరికీ చాలా థాంక్స్.. నా పుట్టినరోజున నేను ఏం చేశానో చెప్పే చిన్న గ్లింప్స్ ఇగో ఇది అంటూ రాసుకొచ్చారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ధోనీ బర్త్‌డే వస్తే చాలు.. ఫ్యాన్స్ ఈ పాత వీడియోను షేర్ చేస్తూ నోస్టాల్జియా ఫీల్ అవుతుంటారు. ఈ ప్రపంచాన్ని గెలిచిన కెప్టెన్ అయినా.. జీవితంలో దొరికే ఇలాంటి చిన్న చిన్న సంతోషాల్లోనే ధోనీ అసలైన ఆనందాన్ని వెతుక్కుంటారని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అందుకే ధోనీ ఎప్పటికీ అందరి గుండెల్లో కూల్ కెప్టెన్ గా ఉండిపోయారు. హాపీ బర్త్‌డే తలా..
MS Dhoni celebrated his birthday like this with his pet dogs 😍😍 pic.twitter.com/3rQCPLPpsP
— Rosy (@rose_k01) July 8, 2023
#HappyBirthdayDhoni
— Dharmaji boka (Hindu) (@BokaThob2383) July 7, 2026
A chapter ends, but the legacy lives forever..💛🏏
Thank you for the memories, the leadership, and the inspiration.
Legends never retire—they become timeless. ❤️#MSDhoni #Thala #MAHI pic.twitter.com/JuTRisc6wN
Happy Birthday to the man who is an inspiration, an emotion, a favorite, and an idol for each and every generation. Wishing the legendary MS Dhoni a very Happy 45th Birthday! 💛🎉#Happybirthdaymsdhoni pic.twitter.com/QK5bMZGGag
— CSK Xtra (@YashPan95976454) July 6, 2026
