ప్రశాంతంగా ముగిసిన RTC ఎన్నికల పోలింగ్‌.. మొదలైన కౌంటింగ్

ప్రశాంతంగా ముగిసిన RTC ఎన్నికల పోలింగ్‌.. మొదలైన కౌంటింగ్

 టీజీఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 2026 అక్టోబర్ 9న సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 98 శాతం నమోదైనట్లు ప్రకటించారు.  గతంలో 2016లో నిర్వహించిన ఆర్టీసీ ఎన్నికల కంటే ఈసారి ఉత్సాహంగా  కార్మికులు ఓట్లు వేశారు.

గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లో 99 శాతం పోలింగ్ నమోదైంది.  హైదరాబాద్ జోన్‌లో 98 శాతం పోలింగ్ జరిగింది. అదే విధంగా  కరీంనగర్ జోన్‌లో 97 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆర్టీసీ ఎన్నికల్లో మొత్తం ఓట్లు 34,886 పోలైనట్లు అధికారులు తెలిపారు.

సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియడంతో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అర్ధరాత్రి వరకు ఏ యూనియన్ విజయం సాధిస్తుందనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్  17న ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన చేయనున్నారు.