- డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసులకు వెళ్లిన అధికారి
- గతంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా విధులు
హైదరాబాద్, వెలుగు: సుదీర్ఘకాలం కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్‌పై పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ తిరిగి తెలంగాణ క్యాడర్‌లో చేరారు. కేంద్ర డిప్యుటేషన్ పూర్తి చేసుకున్న అనంతరం గురువారం డీజీపీ కార్యాలయంలో డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిశారు. త్వరలోనే రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టనున్నారు. 2001 బ్యాచ్‌కు చెందిన అకున్ సబర్వాల్ గతంలో తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో ఆయన నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం పలువురు సినీ ప్రముఖులను విచారించింది. అనంతరం కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు పోస్టింగ్ కేటాయింపుపై అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
