సియా గోయల్.. ఈ పేరు చాలా కాలం యాదుండేలా ఉంది...సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ని తలదన్నేలా ఉన్న ఈమె బాగోతమే ఇందుకు కారణం.ఈమె కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో రోజుకో షాకింగ్ విషయం తెలుస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటపడింది. కేతన్ హత్యకు నాలుగు నెలల ముందే సియా గోయల్ తన లవర్ తో సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందని వెల్లడించారు పోలీసులు.
కేతన్ తో నిశ్చితార్థం సమయంలోనే సీక్రేట్ర్ మ్యారేజ్..
సియా గోయల్ చేతన్ చౌదరిల వాట్సాప్ చాట్స్, ఇతర డిజిటల్ ఆధారాలను పరిశీలించగా ఈ విషయంలో వెలుగులోకి వచ్చిందని తెలిపారు పోలీసులు. సియా, చేతన్ తమ కుటుంబాలకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారని... ఫిబ్రవరి 19న కేతన్ అగర్వాల్‌తో సియా నిశ్చితార్థం జరిగిన సమయంలోనే ఈ వివాహం జరిగి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు పోలీసులు. అయితే, ఈ సీక్రెట్ పెళ్లి నిశ్చితార్ధానికి ముందు జరిగిందా లేక తర్వాత జరిగిందా అనేది తెలియాల్సి ఉంది.
సియా గోయల్ ఫోన్లో గత ఆరు, ఏడు నెలల వాట్సాప్ చాట్స్, కాల్ రికార్డులు, లొకేషన్ హిస్టరీ, ఇంటర్నెట్ సెర్చ్ తో సహా క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు పోలీసులు. డిజిటల్ ఆధారాలు విచారణలో సహాయపడతాయని తెలిపారు పోలీసులు.
ఎప్పటికి జరగని పెళ్లి అంటూ ఫ్రెండ్ తో చాటింగ్
అంతే కాకుండా సియా గోయల్ బీడ్ కి చెందిన తన స్నేహితురాలికి మధ్య జరిగిన వాట్సాప్ చాట్ కూడా కీలకంగా మారిందని తెలిపారు. పెళ్లి కోసం ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేందుకు ఆధార్ కార్డు పంపమని సియా తన ఫ్రెండ్ ని అడిగినట్లు చాట్ లో ఉందని... "ఎప్పటికి జరగని పెళ్లి" అంటూ సియా పేర్కొన్నట్లు తెలిపారు పోలీసులు. ఈ చాట్ కి హత్యతో సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.
కేతన్‌ను చంపడానికి మొదటి ప్రయత్నం జూన్ 14న జరిగిందని, అయితే అది విఫలమైందని తెలిపారు పోలీసులు. ఆ సమయంలో సియా భయపడిందని, ఆ తర్వాత తాను ఒంటరిగా ఈ పని చేయలేనని చేతన్‌కు చెప్పిందని అంటున్నారు పోలీసులు. దీంతో ఇద్దరూ కలిసి కేతన్ హత్యకు స్కెచ్ వేశారని తెలిపారు పోలీసులు.
