The Paradise Bookings: ‘ది ప్యారడైజ్’కు బుకింగ్స్‌లో బీభత్సమైన రెస్పాన్స్.. లక్ష టికెట్లు దాటేశాయ్.. రూ.10 కోట్ల గ్రాస్ పైనే!

The Paradise Bookings: ‘ది ప్యారడైజ్’కు బుకింగ్స్‌లో బీభత్సమైన రెస్పాన్స్.. లక్ష టికెట్లు దాటేశాయ్.. రూ.10 కోట్ల గ్రాస్ పైనే!

నేచురల్ స్టార్ నాని మరో రెండ్రోజుల్లో థియేటర్లలో మాస్ జాతర షురూ చేయనున్నాడు. మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’తో సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అంతకంటే ముందే సెప్టెంబర్ 23 రాత్రి ప్రీమియర్స్‌తో బాక్సాఫీస్ బొమ్మ అదిరిపోనుంది. రిలీజ్‌కు ఇంకా సమయం ఉండగానే ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు చూపిస్తోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో టికెట్లకు వస్తున్న రెస్పాన్స్ ట్రేడ్ వర్గాలను సైతం ఆకట్టుకుంటోంది. బుకింగ్స్ ఇదే జోరులో కొనసాగితే నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌ను అందుకునే దిశగా ‘ది ప్యారడైజ్’ దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఓపెన్ చేసిన వెంటనే ఫుల్ జోష్!

నైజాం ఏరియాలో పరిమిత టికెట్ ధరల పెంపుతో ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు తెరలేవగానే.. బుకింగ్స్‌లో దూకుడు మొదలైంది. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటంతో నాని సినిమాపై ఉన్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్దిసేపటికే భారీ సంఖ్యలో టికెట్లు సేల్ కావడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం. అంతేకాదు.. నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే సుమారు రూ.10 కోట్ల గ్రాస్ మార్క్‌ను ‘ది ప్యారడైజ్’ టచ్ చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రిలీజ్‌కు ముందే ఈ రేంజ్‌లో దూకుడు చూపిస్తుండటంతో.. నాని బాక్సాఫీస్ స్టామినాపై మరోసారి ఫోకస్ పడింది. ఇదే జోరు కొనసాగితే ఓపెనింగ్ డే నాటికి ఈ లెక్కలు మరింత భారీగా మారే అవకాశం కనిపిస్తోంది.

టికెట్ ధరలు..

ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.500 వరకూ పెంచుకునే అవకాశం ప్రభుత్వం నుంచి లభించింది. డే-1 నుంచి డే-4 వరకూ సింగిల్ స్క్రీన్లలో రూ.225 వరకూ, మల్టీప్లెక్స్ల్లో రూ.390 వరకూ టికెట్ రేట్లు ఉండనున్నాయి. డే5 నుంచి డే-10 వరకూ సింగిల్ స్క్రీన్లలో 200 వరకూ, మల్టీప్లెక్స్ల్లో రూ.340 వరకూ టికెట్ రేట్లను తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేసింది. 

రీజనబుల్ రేట్లు.. రికార్డు బుకింగ్స్!

ప్రస్తుతం భారీ టికెట్ రేట్లపై ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో.. ‘ది ప్యారడైజ్’ టీమ్ తీసుకున్న టికెట్ ప్రైసింగ్ నిర్ణయం బుకింగ్స్‌పై పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. మరీ భారీగా ధరలు పెంచకుండా పరిమిత హైక్‌తో టికెట్లను అందుబాటులోకి తీసుకురావడంతో.. ప్రేక్షకుల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. టికెట్ ధరలు అందుబాటులో ఉండటంతో థియేటర్లలో సినిమాను ఎక్స్‌పీరియన్స్ చేయాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

►ALSO READ | Narayanamma Song: ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ.. రచ్చ లేపనున్న ‘నారాయణమ్మ’ స్పెషల్ సాంగ్!

మొత్తంగా రిలీజ్‌కు ముందే లక్ష టికెట్ల మార్క్.. నైజాం ఏరియాలో సుమారు రూ.10 కోట్ల అడ్వాన్స్ గ్రాస్ అంటూ వినిపిస్తున్న బుకింగ్స్ లెక్కలు ‘ది ప్యారడైజ్’పై ఉన్న క్రేజ్, అంచనాలను మరోసారి హైలైట్ చేస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఈ రేంజ్‌లో దూకుడు చూపిస్తున్న నాని మూవీ.. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఓపెనింగ్స్ నమోదు చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.