Narayanamma Song: ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ.. రచ్చ లేపనున్న ‘నారాయణమ్మ’ స్పెషల్ సాంగ్!

Narayanamma Song: ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ.. రచ్చ లేపనున్న ‘నారాయణమ్మ’ స్పెషల్ సాంగ్!

విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నంబర్: 47 / AK 47)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా.. వెంకీ మామ తనదైన కామెడీ టైమింగ్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేశారు. అప్పు, ఐశ్వర్యం వంటి అంశాలను టీజర్‌లో ఆసక్తికరంగా చూపించి సినిమాపై త్రివిక్రమ్ మరింత క్యూరియాసిటీ పెంచారు.

ఈ క్రమంలో మేకర్స్ మరో క్రేజీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ను రేపు సెప్టెంబర్ 22న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ‘మ్యూజిక్ సెన్సేషన్’ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ పాట బిగ్ బ్లాస్ట్‌లా ఉండబోతుందంటూ మేకర్స్ హైప్ పెంచారు.

అయితే ఈ సాంగ్‌కు సంబంధించిన అప్‌డేట్‌లో అసలు కిక్ ఇచ్చింది మాత్రం.. వెంకీ మామతో కలిసి కనిపించిన ముగ్గురు క్రేజీ భామలు. అందులో శ్రీనిధి శెట్టి, డింపుల్ హయతి, నివేదా పేతురాజ్ లతో వెంకటేష్ ఉన్న స్టైలిష్ పిక్. దీంతో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ ఎలాంటి స్టెప్పులతో అదరగొట్టబోతున్నారు? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

థమన్ బీట్‌కు వెంకీ మామ గ్రేస్, ముగ్గురు భామల గ్లామర్ తోడైతే ఈ పాట మాస్‌కు మంచి కిక్ ఇవ్వడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ‘నారాయణమ్మ’ ఫస్ట్ సింగిల్‌పై ఇప్పుడు ఫుల్ క్రేజ్ నెలకొంది. రేపు ఈ పాట విడుదల కానుండటంతో వెంకీ మామ అభిమానులు, మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

►ALSO READ | Akkineni Family: మూడు తరాల అక్కినేని ఫ్యామిలీ.. ఒకే ఫ్రేమ్‌లో ANR వారసుల సందడి

అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’..

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. వెంకటేష్ కామెడీ టైమింగ్‌కు త్రివిక్రమ్ మార్క్ డైలాగులు, ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ తోడైతే ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ట్రీట్‌గా మారే అవకాశం ఉంది. మొత్తానికి టీజర్‌తోనే మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’ థియేటర్లలో ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.