రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టం లేదు.. వన్డే వరల్డ్ కప్‌పై మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టం లేదు.. వన్డే వరల్డ్ కప్‌పై మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్‌కి మరో ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో టీమిండియా దిగ్గజ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవిష్యత్తుపై క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభమయ్యే సమయానికి రోహిత్‌కి 40 ఏళ్లు, కోహ్లీకి 39 ఏళ్లు నిండుతాయి. దీంతో భారత మాజీ ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ హిట్ మ్యాన్, కింగ్ కోహ్లీల ప్రపంచకప్ ప్రాతినిధ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

రోహిత్, కోహ్లీ జట్టులో లేకపోయినా నో ప్రాబ్లం: 

* భారత జట్టుకున్న అద్భుతమైన బెంచ్ స్ట్రెంత్‌ గురించి సందీప్ పాటిల్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు జట్టులో ఉన్నా, లేకపోయినా టీమిండియా ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం పడదని స్పష్టం చేశారు.

* మూడు ప్రధాన అంశాలు: వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం అనేది ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంది. మొదటిది వారి ఆడే ఉత్సాహం, రెండోది ఫిట్‌నెస్, మూడోది సెలెక్టర్ల ఆలోచనా విధానం అని పాటిల్ అన్నారు.

* బెంచ్ స్ట్రెంత్ బలం: సెలెక్టర్లు భవిష్యత్తు వైపు చూస్తున్నారా? ఆ దిగ్గజాల స్థానాన్ని భర్తీ చేయగల బలమైన యువ ఆటగాళ్లు మనకు ఉన్నారా? అనేది ముఖ్యం. ప్రస్తుతం టీమిండియాకున్న బెంచ్ స్ట్రెంత్‌ చూస్తే.. రోహిత్, విరాట్ జట్టులో ఉన్నా లేకపోయినా భారత జట్టుకు ఎలాంటి సమస్యలు ఎదురుకావని తేల్చి చెప్పారు. 

ALSO READ : నన్ను కోసినా వచ్చేది బ్లూ కలర్ రక్తమే

* దిగ్గజాలుగా మిగిలిపోతారు: వారిద్దరి ప్రాధాన్యతను గుర్తు చేస్తూ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఎన్నో ఏళ్లుగా క్రికెట్‌కు సేవలు అందించిన ఆల్-టైమ్ లెజెండ్స్.. వైట్ బాల్ క్రికెట్‌లో రోహిత్ అసాధారణమైన ఆటగాడిగా, విరాట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నాడు. 

వెస్టిండీస్ సిరీస్‌కు రోహిత్, కోహ్లీ ఎంపిక: 

వన్డే వరల్డ్ కప్‌పై సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ, త్వరలో జరగనున్న వెస్టిండీస్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరినీ ఎంపిక చేశారు. యంగ్ స్టార్ శుబ్‌మన్ గిల్ ఈ సిరీస్‌లో జట్టును నడిపించనున్నాడు.

వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు:

శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, మహమ్మద్ సిరాజ్, ఆకిబ్ నబీ, యశస్వి జైస్వాల్, నమన్ ధీర్.