నేచురల్ స్టార్ నాని నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ‘దసరా’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే టీజర్, పోస్టర్స్‌తో రా అండ్ రస్టిక్ యాక్షన్‌ను చూపించిన మేకర్స్.. తాజాగా సెన్సార్ విషయంపై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.
సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్:
‘ది ప్యారడైజ్’కు సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ జారీ చేసింది. అంటే 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సి ఉంటుంది. సినిమాలోని హింసాత్మక సన్నివేశాలు, రక్తసిక్తమైన యాక్షన్, మాస్ ఎలివేషన్స్, రా ట్రీట్‌మెంట్ కారణంగానే ఈ సర్టిఫికేషన్ వచ్చినట్లు తెలుస్తోంది.
మేకర్స్ కూడా ఈ విషయాన్ని తమదైన స్టైల్లో ప్రకటించారు. “సినిమాలోని భావోద్వేగం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది… కానీ జడల్ పాత్రలోని రా అండ్ రస్టిక్ నేచర్ మాత్రం పెద్దలకు మాత్రమే” అంటూ ‘The Paradise’కు A సర్టిఫికేట్ వచ్చిన విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
While the emotion of the film is for everyone…
— THE PARADISE (@TheParadiseOffl) September 21, 2026
JADAL’s rawness is strictly for the adults 🔥#TheParadise is certified 𝗔 ❤🔥
GRAND RELEASE WORLDWIDE ON 24⋆09⋆26 pic.twitter.com/l1wpS4plUi
రక్తంతో తడిసిన ‘ప్యారడైజ్’ నేల..
శ్రీకాంత్ ఓదెల తన సినిమాల్లో కనిపించే రస్టిక్ నేటివిటీ, వైలెన్స్‌ను ‘ది ప్యారడైజ్’లో మరింత నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా నాని పోషిస్తున్న జడల్ పాత్రలోని రా యాక్షన్, ఫైట్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నాని చేసిన పాత్రలకు భిన్నంగా, మరింత మాస్ అండ్ ఇంటెన్స్ షేడ్స్‌లో జడల్ పాత్రను డిజైన్ చేసినట్లు టాక్. దీంతో ‘ది ప్యారడైజ్’లో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో A సర్టిఫికేట్ మరింత ఆసక్తిని పెంచుతోంది.
ALSO READ : ‘ది ప్యారడైజ్’కు బుకింగ్స్‌లో బీభత్సమైన రెస్పాన్స్..
పేరెంట్స్.. టికెట్లు బుక్ చేసే ముందు ఇది గుర్తుపెట్టుకోండి!
సినిమాకు A సర్టిఫికేట్ రావడంతో పేరెంట్స్ తప్పకుండా ఈ విషయాన్ని గమనించాలి. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు థియేటర్లలో ఎంట్రీ ఉండదు. నాని మీద ప్రేమతో పిల్లలకు కూడా టికెట్లు బుక్ చేస్తే.. థియేటర్ దగ్గరే అసలు ట్విస్ట్ ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ‘ది ప్యారడైజ్’ టికెట్లు బుక్ చేసుకునే ముందు వయసు పరిమితిని తప్పకుండా చెక్ చేసుకోవాలి. పెద్దలకు మాత్రం జడల్ రా అండ్ రస్టిక్ ప్రపంచంలోకి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మొత్తానికి.. ఎమోషన్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉన్నా.. జడల్ రా యాక్షన్ మాత్రం పెద్దలకు మాత్రమే అన్న మేకర్స్ మాటలతో ‘ది ప్యారడైజ్’పై క్యూరియాసిటీ మరింత పెరిగింది.
Jadal Zamana Shuru ❤🔥#TheParadise bookings in full swing💥💥
— THE PARADISE (@TheParadiseOffl) September 20, 2026
GRAND RELEASE WORLDWIDE ON 24⋆09⋆26 pic.twitter.com/7j1QUM2TcE
