శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. పలువురికి గాయాలు అయ్యాయి. సోమవారం (సెప్టెంబర్ 21) ఉదయం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటన స్థలాన్న పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
