BCCI Drops Gautam Gambhir: భారత క్రికెట్ అభిమానులకు ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ త్వరలో జరగబోయే జింబాబ్వే పర్యటనతో పాటు ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు దూరం కానున్నారు. ఊపిరి సలపని బిజీ షెడ్యూల్ కారణంగా కోచింగ్ స్టాఫ్ మీద పడుతున్న పనిభారాన్ని తగ్గించేందుకు బీసీసీఐ ఈ నయా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. దీనికి ప్రధాన కారణం రాబోయే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో టీమిండియా అంతర్జాతీయ క్యాలెండర్ ఫుల్ బీజీగా ఉండటమే.. ఒకవైపు చైనాలోని హాంగ్‌జౌ వేదికగా ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలు జరగనుండగా.. అదే సమయంలో ఇండియాలో వెస్టిండీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్ స్టార్ట్ కానుంది. ఒకే కోచింగ్ బృందం రెండు చోట్లా పర్యవేక్షించడం అసాధ్యం కావడంతో గంభీర్ సేనను కేవలం వెస్టిండీస్ సిరీస్‌కే పరిమితం చేసి, యువ జట్టు కోసం కోచింగ్ స్టాఫ్ ని బీసీసీఐ బరిలోకి దించింది.
తాత్కాలిక బాస్‌గా వీవీఎస్ లక్ష్మణ్!
ఈ బీజీ షెడ్యూల్ వల్ల గౌతమ్ గంభీర్ అందుబాటులో లేకపోవడంతో, నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. లక్ష్మణ్‌కు ఇలాంటి రోల్స్ కొత్తేమీ కాదు, గతంలో రాహుల్ ద్రవిడ్ రెస్ట్ తీసుకున్న టైంలోనూ లక్ష్మణ్ టీమిండియాను సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు. గత ఆసియా క్రీడల్లో భారత్ పసిడి (Gold Medal) పతకం గెలవడంలో లక్ష్మణ్ కీలక పాత్ర పోషించారు. లక్ష్మణ్‌తో పాటు యంగ్ టీమ్‌కు దిశానిర్దేశం చేయడానికి సరికొత్త సపోర్ట్ స్టాఫ్‌ను బీసీసీఐ సెట్ చేసింది.
కొత్త కోచింగ్ స్టాఫ్:
భారత మాజీ స్పిన్నర్ సునీల్ జోషి బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనుండగా.. మాజీ బ్యాట్స్‌మెన్ హృషికేష్ కనిత్కర్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ త్రయం జింబాబ్వే టూర్ ముగించుకుని, ఆ వెంటనే ఆసియా గేమ్స్‌లో బరిలోకి దిగే భారత యువ జట్టుకు గైడెన్స్ ఇవ్వనుంది. మరోవైపు, సీనియర్ ప్లేయర్స్ తో కూడిన టీమ్‌కు స్వదేశంలో జరిగే విండీస్ సిరీస్ కోసం గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా సేవలు అందించనున్నాడు.
ALSO READ : జింబాబ్వే టూర్కి సంజుకు నో ఛాన్స్..
వెస్టిండీస్ భారత పర్యటన షెడ్యూల్:
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే ఈ హై-వోల్టేజ్ సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 17 వరకు జరగనుంది.. ఇందులో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఉంటాయి. వన్డే మ్యాచ్‌లు తిరువనంతపురం, గువహటి, చండీగఢ్‌లలో జరగనుండగా.. టీ20 మ్యాచ్‌లు లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరు వేదికలుగా జరగనున్నాయి. ఆసియా క్రీడల తేదీలు, ఈ సిరీస్ స్టార్టింగ్ మ్యాచ్ డేట్స్ ఒకేసారి క్లాష్ అవుతుండటంతో బీసీసీఐ ఈ మాస్టర్ ప్లాన్ వేసింది.
🔴 BCCI DROPS COACHING STAFF: LAXMAN GETS CHARGE, GAMBHIR LEFT OUT 🤯
— Sam (@cricsam02) July 7, 2026
- Former India captain VVS Laxman is set to coach India's second-string teams for the Zimbabwe tour and the 2026 Asian Games.
- While Gautam Gambhir will stay with the senior team. The BCCI has decided to… pic.twitter.com/JjSRKnG27k
