కొండగట్టు అంజన్న, ధర్మపురి నరసింహుడికి మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ ప్రత్యేక పూజలు

కొండగట్టు అంజన్న, ధర్మపురి నరసింహుడికి  మ్యూజిక్ డైరెక్టర్  ఆర్పీ పట్నాయక్ ప్రత్యేక పూజలు

 

మ్యూజిక డైరెక్టర్ , నటుడు ఆర్పీ పట్నాయక్ తన కుటుంబ సమేతంగా కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.ఆలయంలో స్వామివారికి ఆర్పీ పట్నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందించి, శేషవస్త్రాలతో సత్కరించారు. స్వామివారి దర్శనం తనకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతినిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరిపై ఆంజనేయస్వామి కృపాకటాక్షాలు ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఇన్‌స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : వలస కార్మికుల పిల్లల కోసం.. మొబైల్ అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు సీతక్క, వివేక్ వెంకటస్వామి

కొండగట్టు దర్శనం అనంతరం ఆర్పీ పట్నాయక్ కుటుంబం ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించారు. అక్కడ దేవస్థాన అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.  స్వామివారి దర్శనం ముగిసిన తర్వాత వేద పండితులు, అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. దేవస్థానం తరఫున శేష వస్త్రం, తీర్థప్రసాదాలు అందజేసి ఆయనను ఘనంగా సత్కరించారు.