టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని వరుసగా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ.. తన కెరీర్ ను మరోస్టాయికి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్ఠాయిలో ది ప్యారడైజ్ ' మూవీలో నటిస్తుండగా.. లేటెస్ట్ గా మారో క్రేజీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పిన ఫైనల్ స్క్రిప్ట్ నేరేషన్ నానికి విపరీతంగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం.
భారీ బడ్జెట్ తో..
ఈ క్రేజీ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఈ కాంబినేషన్ పై చర్చలు జరుగుతుండగా.. ఇప్పుడు కథ పూర్తిగా లాక్ కావడంతో ఈ ప్రాజెక్టు ముందుకు కదిలినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. వెంకీ అట్లూరి మార్క్ ఎమోషన్స్, నాని నటన తోడైతే బాక్సాఫీస్ వద్ద పూనకాలే అని ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు వేస్తున్నారు.
షూటింగ్ ఎప్పుడంటే?
మొత్తానికి కథ ఓకే అయినప్పటికీ, ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడం నాని బిజీ డైరీపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం నాని 'ది ప్యారడైజ్' (The Paradise) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ అనుకున్న సమయం కంటే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటోంది. దీని తర్వాత సుజీత్ దర్శకత్వంలో 'బ్లడీ రోమియో' (Bloody Romeo) లైన్ లో ఉంది. అయితే ఈ 'బ్లడీ రోమియో' అనుకున్నట్లు పూర్తయితే, వచ్చే ఏడాది వేసవి తర్వాత వెంకీ అట్లూరి సినిమా ప్రారంభమవుతుంది. ఒకవేళ డైరెక్టర్ సుజీత్ దీనికంటే ముందే పవన్ కళ్యాణ్‌తో 'OG 2' ని పట్టాలెక్కిస్తే.. నాని తన లైనప్‌ను మార్చి వెంకీ అట్లూరి ప్రాజెక్ట్‌ను ముందే స్టార్ట్ చేసే అవకాశం ఉంది.
వెంకీ అట్లూరి జోరు..
ప్రస్తుతం వెంకీ అట్లూరి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు కాంబినేషన్‌లో వస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' (Viswanath and Sons) పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇందులో రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్స్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ALSO READ : ఈ వారం థియేటర్, ఓటీటీ సినిమాలివే.. ‘లెనిన్’తో పాటు స్ట్రీమింగ్‌లో 20కి పైగా మూవీస్
నాని-వెంకీ అట్లూరి కాంబోకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మరికొద్ది రోజుల్లోనే రానుంది. క్లాస్, మాస్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ సినిమా నాని కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం కమర్షియల్ ఫార్ములాకే పరిమితం కాకుండా.. సరికొత్త కాన్సెప్ట్‌లతో వస్తున్న నాని ఖాతాలో ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి..
