జింబాబ్వే టూర్కి సంజుకు నో ఛాన్స్.. శాంసన్ని డ్రాప్ చేయడంపై నెట్టింట విమర్శలు

జింబాబ్వే టూర్కి సంజుకు నో ఛాన్స్.. శాంసన్ని డ్రాప్ చేయడంపై నెట్టింట విమర్శలు

Sanju Samson: ఈ నెల చివర్లో జరగబోయే జింబాబ్వే టూర్ కోసం ప్రకటించిన భారత టీ20 జట్టులో స్టార్ ఆటగాడు సంజు శాంసన్ పేరు లేకపోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆడుతున్న టాప్ బ్యాటర్లందరినీ సెలెక్ట్ చేసినా, సంజును మాత్రం పక్కన పెట్టేసరికి ఫ్యాన్స్ సెలెక్టర్ల మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు. కానీ బీసీసీఐ దీనిపై ఎలాంటి అధికారిక కారణం చెప్పలేదు.  

వరుస ఫెయిల్యూర్స్.. వండర్ కిడ్ ఎంట్రీ: 
నిజానికి మొన్నటి టీ20 వరల్డ్ కప్ 2026లో అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్న సంజు శాంసన్.. ఐపీఎల్‌లో కూడా రెండు సెంచరీలతో మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. కానీ ఆ తర్వాతే కథ అడ్డం తిరిగింది. ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌లలో, ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టీ20లో సంజు ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అతడి స్థానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ తన డెబ్యూ మ్యాచులోనే మంచి ఇంటెంట్ చూపించాడు. దీంతో వైభవ్ కి లాంగ్ రన్ ఇవ్వాలని బీసీసీఐ చూస్తుంది. అలాగే ఐపీఎల్ 2026 లో పంజాబ్ కింగ్స్ తరఫున దుమ్మురేపిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌కు సంజు ప్లేస్‌లో వికెట్ కీపర్ బ్యాటర్‌గా జట్టులో ఛాన్స్ దక్కింది.  

కాస్త హోంవర్క్ చేయండి: 
సంజు శాంసన్‌ను జట్టు నుంచి తీసేయడంపై ఫ్యాన్స్ మండిపడుతుంటే.. బీసీసీఐకి చెందిన ఒక సీనియర్ పీటీఐతో మాట్లాడుతూ.. జింబాబ్వే టూర్‌కు సంజుకి రెస్ట్ ఇస్తే అంత ఆశ్చర్యం ఎందుకు? విమర్శలు చేసేటోళ్లు కాస్త హోంవర్క్ చేయాలని సూచించాడు. సెప్టెంబర్‌లో జరగబోయే ఆసియా గేమ్స్ (Asian Games) స్క్వాడ్‌లో సంజు శాంసన్ ఉన్నాడు. అతడు టీంలో సీనియర్ ప్లేయర్.. బెంచ్‌ మీద కూర్చోబెట్టడానికి ఆయనని జింబాబ్వే టూర్‌కు తీసుకెళ్లడం వేస్ట్.. అందుకే రెస్ట్ ఇచ్చామని చెప్పుకొచ్చాడు.

రింకూ సింగ్, మయాంక్ యాదవ్ కమ్‌బ్యాక్: 
ఈ టూర్‌లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఫినిషర్ రింకూ సింగ్, ఎక్స్‌ప్రెస్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌లు మళ్లీ టీంలోకి కమ్‌బ్యాక్ ఇచ్చారు. సంజుతో పాటు హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్ (వీరు ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు సెలెక్ట్ అయ్యారు), అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్‌లను కూడా జింబాబ్వే సిరీస్ నుంచి పక్కన పెట్టారు.

ALSO READ : ఫిఫా నుంచి అమెరికా ఔట్.. ట్రంప్ డ్యాన్స్‌తో లుకాకు సెలబ్రేషన్..

మ్యాచ్‌ల షెడ్యూల్
భారత జట్టు జింబాబ్వేలో మొత్తం మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ హరారే వేదికగా జరగనున్నాయి. 
* జూలై 23న మొదటి టీ20 
* జూలై 25న రెండో టీ20
* జూలై 27న మూడో టీ20

టీమిండియా స్క్వాడ్:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, సూర్యాంష్ షెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).