అంతర్జాతీయ వేదికలపై తనదైన శైలితో ఆకట్టుకునే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. తాజాగా ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో సందడి చేసింది. ప్రముఖ అంతర్జాతీయ డిజైనర్ బ్రాండ్స్ ప్రదర్శనలో పాల్గొన్న ఆమె, తన గ్లామరస్ లుక్స్‌తో కెమెరా కళ్లను తనవైపు తిప్పుకుంది.
ఆరెంజ్ కలర్ కాస్ట్యూమ్స్‌లో భర్త నిక్ జోనస్‌తో కలిసి స్టైలిష్ లుక్‌లో కనిపించిన ఆమె స్టైలిష్ వాకింగ్‌తో ఈ ఫ్యాషన్ షోకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ప్యారిస్ లుక్‌లో ప్రియాంక మరింత స్పెషల్‌గా ఉందంటూ సెలబ్రిటీస్ మొదలు అభిమానుల వరకు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు కళ్లు తిప్పుకోలేని అందం పీసీ బ్యుటిదీ అంటూ నెటిజన్లు ట్వీట్స్ పెడుతున్నారు.
Nick Jonas & Priyanka Chopra at the Dior Fall 2026 Couture Show in Paris today. pic.twitter.com/4xAuF57eDP
— Jonas Brothers Daily News 🩵 (@Jonas_DailyNews) July 6, 2026
రాజమౌళి సినిమా ‘వారణాసి’తో పాటు మరికొన్ని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ, ఇలాంటి ఈవెంట్స్‌లో డిజైనర్ కాస్ట్యూమ్స్‌లో మెరిసి తన ఫ్యాషన్ సెన్స్ ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని ప్రియాంక నిరూపిస్తోంది.
వారణాసి ‘మందాకిని’:
మైథాలజీ బ్యాక్‌డ్రాప్‌లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ టైమ్ ట్రావెల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇటీవలే హైద్రాబాద్, జోర్డాన్‌లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంది. తర్వాతి షెడ్యూల్ అంటార్కిటికాలో ఉండబోతోందని టాక్. ఈ మూవీలో ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది.
►ALSO READ | Maaremma: రవితేజ తమ్ముడు కొడుకు సినిమా.. తెలంగాణ నేటివిటీ ‘మారి’ సాంగ్‌కు సూపర్ రెస్పాన్స్
పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఆర్. మాధవన్ 'హనుమంతుడి' పాత్రలో మెరవబోతున్నట్లు టాక్. మరో కీలక పాత్ర ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
