- అక్కసుతో ఇష్టారీతిన మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఫైర్
చెన్నూరు, వెలుగు: చెన్నూరు పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఓర్వలేక కొందరు బీఆర్ఎస్నాయకులు మంత్రి వివేక్ వెంకటస్వామి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. మంగళవారం చెన్నూరులోని క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ఏర్పాటు చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్, వంద పడకల ఆస్పత్రి, బస్ డిపో, రోడ్డు విస్తరణ పనులు, తాగునీరు ట్యాంకుల నిర్మాణాలు వంటి అభివృద్ధి పనులు జరుగుతున్నా బీఆర్ఎస్ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక పనికట్టుకొని మైనార్టీ హాస్టల్‌కి వెళ్లి విద్యార్థులు భోజనం చేసిన తర్వాత రాత్రిపూట బలవంతంగా కొందరి ప్లేట్లలో కారం పొడి వేసి రోజూ ఇలాంటి భోజనం పెడుతున్నారని పిల్లచేత బలవంతంగా మాట్లాడించి కుట్రపన్నారని మండిపడ్డారు. జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ, అనేక అక్రమాలకు, ఇసుక దందాకు పాల్పడితే మంత్రి అతడిని పార్టీ నుండి సస్పెండ్ చేశారని, ఆ అక్కసుతోనే మంత్రిపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఫైర్అయ్యారు. మంత్రిపై అసభ్య పదజాలంతో మాట్లాడితే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. సమావేశంలో నాయకులు పెద్దింటి శ్రీనివాస్, బి.కరుణాసాగర్, అంకా గౌడ్, ఎల్.మహేశ్, పి.నాగరాజ్, చెన్నూరు రాజేశ్, చెన్న వెంకటేశ్, టి.సతీశ్, సలీం, సాహిర్, ఖలీల్, కరీం, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
