హైదరాబాద్, వెలుగు: దాదాపు రూ.1.5 లక్షల కోట్ల విలువైన దేశీయ మిఠాయి, నమ్కీన్ పరిశ్రమ అతిపెద్ద వ్యాపార సదస్సుకు సిద్ధమవుతోంది. వరల్డ్ మిఠాయి అండ్ నమ్కీన్ కన్వెన్షన్ 2026 పర్చేజింగ్ ఎడిషన్ ఈనెల 16 నుంచి 18 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. ఈ సదస్సుకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు.
పండుగల సీజన్ కంటే ముందే ముడి పదార్థాలు, డ్రై ఫ్రూట్స్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యంత్రాల కొనుగోళ్లకు ఈ సదస్సు వేదికగా నిలవనుంది. కన్వెన్షన్లో 300కుపైగా ఎగ్జిబిటర్లు, 30వేల మందికిపైగా వ్యాపార సందర్శకులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం, కొత్త సరఫరాదారులను కనుగొనడం, ఉత్పత్తుల నిల్వ సామర్థ్యాన్ని పెంచే పద్ధతులపై ఇక్కడ అవగాహన సదస్సులు నిర్వహిస్తారు.
