AI టెక్నాలజీ వృద్ధికి తెలుగు రాష్ట్రాలు కీలకం.. వ్యవసాయం, ఆరోగ్యం విద్య రంగాల్లో AI పాత్రపై చర్చ

AI టెక్నాలజీ వృద్ధికి  తెలుగు రాష్ట్రాలు కీలకం.. వ్యవసాయం, ఆరోగ్యం విద్య రంగాల్లో AI పాత్రపై చర్చ

హైదరాబాద్​, వెలుగు:    వ్యవసాయం, ఆరోగ్యం, తయారీ, ఆర్థిక సేవలు, విద్య రంగాలలో ఏఐ ద్వారా ఉత్పాదకతను, వృద్ధిని పెంచడంపై చర్చించడానికి హైదరాబాద్​లో  ప్రోసస్ సంస్థ  రౌండ్‌‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది.  

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, బీసీజీ భాగస్వామ్యంతో రూపొందించిన "ఏఐ ఫర్ ఆల్" వైట్ పేపర్‌‌పై ఈ సందర్భంగా చర్చించారు. దేశంలో ఏఐ ఆధారిత వృద్ధిని నడపడంలో తెలుగురాష్ట్రాలు కీలకమని టెక్ లీడర్లు స్పష్టం చేశారు.  

ప్రస్తుతం ప్రపంచ ఏఐ ప్రతిభలో మనదేశానికి 16 శాతం వాటా ఉందని, రాబోయే 15 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ 20 శాతం సహకారం అందించనుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సాగు బాగు,  ఏఐ పంట సలహాలు, శాటిలైట్ పర్యవేక్షణ వంటివి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు.