టాటా పవర్ లక్ష్యం.. 2030 నాటికి రూ. లక్ష కోట్ల ఆదాయం

టాటా పవర్ లక్ష్యం..  2030 నాటికి రూ. లక్ష కోట్ల ఆదాయం

న్యూఢిల్లీ: టాటా పవర్ కంపెనీ 2030 నాటికి రూ. లక్ష కోట్ల ఆదాయం, రూ.10వేల కోట్ల లాభం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, పునరుత్పాదక ఇంధనం, తయారీ రంగాల విస్తరణ ద్వారా ఈ వృద్ధిని సాధిస్తామని తెలిపింది. 2026లో కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.63,681 కోట్లుగా, నికర లాభం రూ.5,212 కోట్లుగా నమోదైంది. 

ఒడిశాలో కొత్తగా 10 గిగావాట్ల సోలార్ పరికరాల తయారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు టాటా పవర్ చైర్మన్ చంద్రశేఖరన్ వార్షిక సాధారణ సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం తమిళనాడులోని తిరునెల్వేలి, బెంగళూరు ప్లాంట్లతో కలిపి సంస్థకు 4.9 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ సామర్థ్యం ఉంది. కంపెనీ క్లీన్, గ్రీన్ సొల్యూషన్స్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది.  అణుశక్తి రంగంలోకి కూడా  ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నట్లు టాటా పవర్ ​ప్రకటించింది.