భూదాన్ పోచంపల్లి, వెలుగు: కూలిన కాళేశ్వరాన్ని నింపమనడం బీఆర్‌ఎస్ నాయకుల డ్రామా అని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ, బీఎల్ఏల అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. కూలిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును నింపాలని కేటీఆర్, జగదీశ్ రెడ్డి కోరడం హాస్యాస్పదమని మండిపడ్డారు. కార్యక్రమంలో భూదాన్ పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశం పాల్గొన్నారు.
