జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడైన బుధుడు జులై 7న తన దిశను మార్చుకున్నాడు. పండితులు చెబుతున్నారు. మిధున రాశిలో సవ్య దిశగా ఉన్న బుధుడు తిరోగమనంలో సంచరించడం జులై 7 వ తేది ఉదయం 9.02 గంటలకు ప్రారంభించాడు. దీని ప్రభావంతో మూడు రాశుల ( కర్కాటకం, ధనస్సు, మీనం ) వారికి ఊహించని లాభాలు కలుగుతాయి . మిగతా రాశులవారి జీవితాలపై కూడా ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. 12 రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. . .!
మేషరాశి: బుధుడు తిరోగమనంలో సంచరించడం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. మీరు చేసే పనుల విషయంలో నిరాశ పడవద్దు.ఉద్యోగస్తులకు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. కొన్ని పనులు మిమ్మలను ఆందోళనకు గురిచేస్తాయి. వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండండి. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి బుధుడు తిరోగమనంలో ఉన్నసమయంలో పనిభారం పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
వృషభరాశి: బుధుడు తిరోగమనంలో సంచరించడం వలన ఈ రాశి వారికి అన్ని విధాలా కలసి వస్తుంది. ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి. కొత్త ప్రాజెక్ట్లు చేపడితే ఊహించని లాభాలు కలుగుతాయి. అయితే ముఖ్యమైన వాటిపై ఒప్పందం చేసుకుసందర్భంలో జాగ్రత్తగా ఉండండి. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూల మార్పులు జరుగుతాయి. చిన్న చిన్న విషయాల్లో వాగ్వాదాలు రావచ్చు.. కాబట్టి సంయమనం పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోండి . ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతా మంచే జరుగుతుంది
మిథునరాశి: బుధుడు ఇదేరాశిలో తిరోగమనం చెందడం వలన ఈ రాశి వారికి శ్రమకు తగిన ప్రతి ఫలం లభిస్తుంది. ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. ఆవేశాన్ని.. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఎట్టి పరిస్థితిలో భావోద్వేగానికి లోను కావద్దు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆఫీసులో మీరే కీలకం అవుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు అందుకుంటారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు పొందుతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ప్రేమ వ్యవహారం గందరగోళంగా మారే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది.
కర్కాటక రాశి: బుధుడు.. మిథున రాశిలో తిరోగమనం వలన భద్ర రాజయోగం ఏర్పడింది. దీనివలన ఈ రాశి వారి ప్రతిభకు, ఆలోచనలకు, తెలివితేటలకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. వృత్తి.. ఉద్యోగం.. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు అనుకోకుండా ఏర్పడటంతో సంపద పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులు అధికంగా లాభాలు గడిస్తారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడటం వలన వ్యాపారం విస్తరించే అవకాశం ఉంది. పెళ్లి.. ప్రేమ విషయంలో మొదట్లో కొన్ని అవాంతరాలు ఏర్పడినా... చివరికి మీరు అనుకున్నదే జరుగుతుంది.
సింహరాశి: బుధుడు తిరోగోమనంలో సంచరించడం వలన ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కొన్ని తెలియని అంశాలు మిమ్మలను ఆందోళనకు గురిచేస్తాయి. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు. రోజువారి కార్యక్రమాల విషయాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. ఆర్థిక విషయాల్లో తెలివిగా వ్యవహరించకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. చేతివృత్తులవారికి ప్రోత్సహకాలు అందుతాయి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు కలుగుతాయి. నిరుద్యోగులకు జాబ్ లభిస్తుంది.
కన్యారాశి: బుధుడు తిరోగమన కదలిక వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి. ప్రతి విషయంలోను.. మీకు సంబంధం లేకుండా మాట పడాల్సి వస్తుంది. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. జీవిత భాగస్వామితో వాదనలు ఏర్పడే అవకాశం ఉంది.. ఈ సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశికి చెందిన విద్యార్థుల్లో చదువు పట్ల ఏకాగ్రత తగ్గుదల కనిపిస్తుంది. మిమ్మలను విమర్శించే వారి మాటలు పట్టించుకోకండి. సున్నితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆంజనేయస్వామికి సింధూరం సమర్పించి... ఆకుపూజ చేయండి అంతా మంచే జరుగుతుంది.
తులారాశి : బుధుడు తిరోగమనంలో సంచరించడం వలన ఈ రాశివారికి గడ్డుకాలమని పండితులు అంటున్నారు. ఉద్యోగం మారాలని ప్రయత్నిస్తారు. పనిభారం పెరుగుతుంది. ఆశించినంతగా ఆర్థికంగా పురోగతి ఉండదు. వ్యాపారస్తులు పోటీ మార్కెట్ లో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంచనాలకు మించి ఖర్చు ఉంటుంది. ఏ పని చేపట్టినా కలిసి రాకపోవడంతో .. మీ పని ప్రభావితమవుతుంది. ఇతరుల చెప్పిన మాటల విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. మాసశివరాత్రి రోజు పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయండి అంతా మంచే జరుగుతుంది.
వృశ్చిక రాశి: బుధుడు తిరోగమనంలో సంచారం వలన ఈ రాశికి చాలా మంచి జరుగుతుంది. గతంలో ఆగిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది. మీరు తీసుకొనే నిర్ణయం లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది. ఆఫీసులో మీరే కీలకం కావడంతో ఎక్కువ సమయం పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. కెరీర్ విషయంలో కొంత ఆందోళన చెందుతారు. వ్యాపారస్తులకు అనుకోని లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. తొందరపడి ఎవరితోను ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దని పండితులు సూచిస్తున్నారు. పెళ్లి సంబంధం కోసం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు.
ALSO READ : ఈ తేదీల్లో పుట్టిన వాళ్లకు మైండ్ చాలా షార్ప్..
ధనుస్సు రాశి: బుధుడు తిరోగమనంలో కదలడం వలన ఈ రాశి వారికి సానుకూల ఫలితాలుంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు ... వ్యాపారస్తులకు మంచి సమయం. కేరీర్ పరంగా మంచి నిర్ణయం తీసుకుంటారు. ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది. అనవసరంగా ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. బిజినెస్ చేసే వారు పెట్టే కొత్త పెట్టుబడులకు ఊహించని లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా బలపడతారు. నిరుద్యోగులకు విదేశాల్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రేమ వ్యవహారంలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.
మకరరాశి: బుధుడు తిరోగమనంలో సంచరించడం వలన కొన్ని అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ... వ్యాపారాల్లో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి లేకపోవడంతో చికాకు... అసహనం కలుగుతాయి. ఉద్యోగ విధుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. . వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓర్పు .. సహనం పాటించండి .. తరువాత కాలంలో మంచే జరుగుతుంది. డబ్బును ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఎట్టి పరిస్థితిలో కొత్త ప్రాజెక్ట్లు చేపట్టవద్దని పండితులు సూచిస్తున్నారు. ఆస్తి వ్యవహారాల్లో కీలకనిర్ణయాలు తీసుకోవద్దు. ఆదిత్యహృదయం పారాయణం చేయండి అంతా మంచే జరుగుతుంది.
కుంభరాశి : బుధుడు తిరోగమనంలో సంచరించడం వలన ఈరాశి జాతకులకు మెరుగైన ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు గతంలో ఉన్న ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు ఇంక్రిమెంట్ పొందుతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభిస్తుంది. ఈ సమయంలో చేపట్టిన పనుల విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి. కాని భయపడాల్సిన అవసరం లేదని పండితులు చెబుతున్నారు.
మీనరాశి: భద్రరాజ యోగం వలన ఈ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు. ప్రయత్నం తలపె ట్టినా విజయవంతం అవుతుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడతారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం ఎదురు చూసే వారు గుడ్ న్యూస్ వింటారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లభిస్తుంది. అధికారుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా.. విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి రావడంతో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టే అవకాశం ఉంది. పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి ఆశించిన సంబంధం కుదురుతుంది. చేతి వృత్తుల వారికి అధికంగా ఆర్డర్లు రావడంతో కష్టాలు తీరతాయని పండితులు చెబుతున్నారు
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
