వరుస ప్రాజెక్టులతో స్పీడు పెంచారు వెంకటేష్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో నటిస్తున్న ఆయన.. తాజాగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న మూవీ సెట్‌లో జాయిన్ అయ్యారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబోలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కాగా, కళ్యాణ్ రామ్‌తో పాటు ఇతర నటీనటులపై ఓ సాంగ్‌ను షూట్ చేశారు. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్స్ కీర్తి సురేష్, కృతి శెట్టి కూడా పాల్గొంటున్నారు.
తాజాగా వెంకటేష్ షూటింగ్‌లో చేరడంతో చిత్రీకరణ మరింత వేగం అందుకుంది. ప్రస్తుతం ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్‌లో ప్రధాన తారాగణంతో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని, వీరిద్దరి ఆన్-స్క్రీన్ అనుబంధం, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది.
ALSO READ : Priyanka Chopra: ప్రియాంక చోప్రా గ్లామర్‌కు ప్యారిస్ ఫిదా..
సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
Back with @AnilRavipudi ♥️ and this time with an amazing gang @NANDAMURIKALYAN @KeerthyOfficial @IamKrithiShetty 🤗🤗
— Venkatesh Daggubati (@VenkyMama) June 18, 2026
Sankranthi 2027 Vidudhala ✨@gvprakash @sahugarapati7 @YoursSKrishna @Shine_Screens @ZeeStudios_ @SureshProdns @zeestudiossouth @girishjohar #AmeetBhuvan… pic.twitter.com/DOpxBk8KXN
