ఏం ఆలోచనమ్మా నీది.. కోటి విద్యలు కూటికోసం అనే మాటలు మన పెద్దవాళ్లు చెప్పింది జీవితంలో బ్రతకటం గురించి. కానీ ప్రస్తుతం జెన్ జెడ్ యూత్ మాత్రం దీనికోసం కొత్త మార్గాలను సృష్టించుకుంటూ ఔరా అనేలా ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా ఒక అమ్మాయి తనను ఎవరైనా అద్దెకు తీసుకోవచ్చని పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. కాఫీకి వస్తే ఎంత, బైక్ రైడ్ కోసం ఎంత, బైక్ డేట్, డేట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఎంత అనే పూర్తి రేట్లతో విడుదల చేసిన ఒక కార్డ్ తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.
సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన ఒక పోస్ట్ దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. "Rent Me for a Day" అనే పేరుతో ఒక మహిళ తనతో ఒక రోజు గడపడానికి వివిధ సేవలను అందిస్తున్నట్లు ప్రకటించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్ట్‌ను ఎక్స్ లో నలిని ఉనాగర్ అనే యూజర్ షేర్ చేయగా.. అందులో దివ్య అనే యువతి తనతో కాఫీ, డిన్నర్, షాపింగ్, ఈవెంట్లు, ట్రిప్ వంటి కార్యక్రమాలకు తోడుగా రావడానికి వేర్వేరు చార్జీలను నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ కాన్సెప్ట్ కొందరికి గిగ్ ఎకానమీకి చెందిన కొత్త అవకాశంగా కనిపించగా, మరికొందరు సమాజంలో పెరుగుతున్న ఒంటరితనం, సంబంధాల మారుతున్న రూపం, సేఫ్టీ వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
This is Divya.
— Nalini Unagar (@NalinisKitchen) July 6, 2026
If you need a companion to go somewhere, she started a service called "Rent Me for a Day."
She shared a rate card for the service.
Chill coffee date: ₹1500
Dinner & movie date: ₹2000
Meeting with family: ₹3000
Event companion: ₹3500
Bike date: ₹4000
Public… pic.twitter.com/Wq7k6LpPZX
రేట్ కార్డ్ వివరాలు:
* కాఫీ డేట్ – రూ.15వందలు
* డిన్నర్ + మూవీ – రూ.2వేలు
* ఫ్యామిలీని కలవడం – రూ.3వేలు
* ఈవెంట్‌కు తోడుగా రావడం – రూ.3వేల 500
* బైక్ రైడ్ – రూ.4వేలు
* తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేయడం – రూ.6వేలు
* అడ్వెంచర్ డే – రూ.5వేలు
* కలిసి వంట చేయడం – రూ.3వేల 500
* షాపింగ్‌కు తోడుగా రావడం – రూ.4వేల 500
* రెండు రోజుల వీకెండ్ ట్రిప్ – రూ.10వేలు
* కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్లాన్లు – పరస్పర అంగీకారంతో
ఈ చర్చ మరింత వేగం అందుకోవడానికి మరో ఎక్స్ యూజర్ "మిక్కు" చేసిన పోస్టు కారణమైంది. ఢిల్లీలో కొంతమంది యువతులు "రెంటల్ గర్ల్‌ఫ్రెండ్" ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని.. గంటకు సుమారు రూ.వెయ్యి వరకు పొందుతున్నారని, రోజుకు మూడు నుంచి నాలుగు బుకింగ్‌లు వస్తే రూ.6వేల నుంచి రూ.7వేల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే క్లయింట్లు భోజనం, షాపింగ్ వంటి ఖర్చులు కూడా భరిస్తారని తన పోస్టులో చెప్పింది ఆ యువతి.
Delhi girls are using GF rental platforms to earn money.
— Mikku 🐼 (@effucktivehumor) July 6, 2026
They get free food, free shopping, and around ₹1,000 per hour just for hanging out with a simp. She even played the emotional card and he ended up paying for her shopping. 😭
Sometimes they get 3–4 bookings/day, which… pic.twitter.com/yndC0AZXwX
ఈ పోస్టుతో పాటు షేర్ చేసిన వీడియోలో ఒక యువతి తనను తాను "రెంటల్ గర్ల్‌ఫ్రెండ్"గా పరిచయం చేసుకుంది. తాను KoPartner.in అనే ప్లాట్‌ఫారమ్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నానని.. దీని ద్వారా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో పురుషులు షాపింగ్, సినిమా, ట్రావెల్ వంటి కార్యక్రమాలకు మహిళలను బుక్ చేసుకుంటారని తెలిపింది. వీడియోలో ఆమెకు ఒక బుకింగ్ వచ్చిన తర్వాత కేఫేలో క్లయింట్‌ను కలవడం, వ్యక్తిగత విషయాలు పంచుకోవడం, అనంతరం అతడు ఆమెను షాపింగ్‌కు తీసుకెళ్లడం, చివరగా రెండు గంటల పాటు కలిసి గడిపినందుకు రూ.2వేలు చెల్లించడం చూపించారు వీడియోలో.
►ALSO READ | ఏఐ లేఆఫ్స్ సునామీ.. 2026లో రోజుకు 700 మంది టెక్కీల తొలగింపు: లక్షా 20వేల మంది ఇంటికి
ఈ వైరల్ పోస్టులు సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలకు కారణమయ్యాయి. కొందరు దీనిని గిగ్ ఎకానమీలో మరో ఆదాయ అవకాశంగా అభివర్ణిస్తుండగా, మరికొందరు ఇది ఒంటరితనం పెరుగుతున్న సమాజానికి ప్రతిబింబమని అభిప్రాయపడ్డారు. కొందరు "ఇది యాప్ రూపంలో వస్తే మిలియన్ డాలర్ల వ్యాపారం అవుతుంది" అంటూ కామెంట్ చేశారు. ఇంకొందరు "ఇలాంటి పరిస్థితి రావడం ఆశ్చర్యకరం" అంటున్నారు. మరికొందరు చట్టబద్ధత, సేఫ్టీ, పరస్పర సమ్మతి వంటి అంశాలపై స్పష్టమైన నిబంధనలు అవసరమని సూచించారు. మెుత్తానికి డిజిటల్ యుగంలో సంబంధాలు కొత్త రూపం దాల్చుకుంటున్నాయి.
