వనపర్తి, వెలుగు: సమగ్ర ఓటరు సవరణ జాబితా (సర్) నమోదు ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీరియస్‌గా ఉందని, ఈ కార్యక్రమంలో నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై ప్రత్యేక దృష్టి సారించాల్సి వస్తుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హెచ్చరించారు.
మంగళవారం వనపర్తి, గోపాల్‌పేటలలో డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బీఎల్ఏల అవగాహన సదస్సులలో ఆయన మాట్లాడారు. గోపాల్‌పేట, ఏదుల, రేవల్లి మండలాల్లో సర్ నమోదు ప్రక్రియ ఆశించిన స్థాయిలో జరగడం లేదని, ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వేళ అధికార పార్టీలో ఉంటూ నిర్లక్ష్యం వహించడం సమంజసం కాదన్నారు.
