మరికల్, వెలుగు: ఒక బీఎల్వో రోజుకు 100 ఎన్యూమరేషన్ పత్రాలను నింపాలని నారాయణపేట కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం నారాయణపేట జిల్లా మరికల్, అప్పంపల్లి గ్రామాల్లో ప్రత్యేక ఓటర్ జాబిత కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు.
ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. రెండు రోజుల్లో ఓటర్ల పూర్తి వివరాలతో నింపిన పత్రాలను తీసుకుని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఎమ్మార్వో రాంకోటి, ఎంపీడీవో పృథ్విరాజ్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
