గ్రేటర్ వరంగల్, వెలుగు: రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు గ్రేటర్ వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా హనుమకొండ, వరంగల్ జిల్లా అధికారులతో హనుమకొండ కలెక్టరేట్లో సమావేశం కానున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ భవన్కు వెళ్లి అక్కడ అందిస్తున్న సేవలను తెలుసుకోనున్నారు. మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్టాళ్లను ప్రారంభించనున్నారు.
