రఘునాథపల్లి(స్టేషన్ ఘనపూర్), వెలుగు: నిద్రిస్తున్న వృద్ధురాలిపై ఓ కౌన్సిలర్ అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ చాగల్లుకు చెందిన ఓ వృద్ధురాలు మంగళవారం తన ఇంటి పైఅంతస్తులో నిద్రిస్తోంది. ఈ సమయంలో 9వ వార్డు కౌన్సిలర్ సంపత్‌కుమార్ ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారయత్నం చేశాడు.
సత్తెమ్మ గట్టిగా కేకలు వేయగా, కింద అంతస్తులో ఉన్న ఆమె కొడుకు పైకి వెళ్లారు. వారిని గమనించిన సంపత్‌కుమార్ పక్కనే ఉన్న బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుని దాక్కున్నాడు. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని కౌన్సిలర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
