హనుమకొండ పద్మాక్షమ్మ గుట్ట వద్ద రెక్క విరిగిన స్థితిలో లభించిన అరుదైన కొమ్ముల గుడ్లగూబ ప్రస్తుతం వరంగల్ జూ పార్కులో సందర్శకులను ఆకట్టుకుంటోంది. జూ పార్కు సిబ్బంది దానిని రెస్క్యూ చేసి చికిత్స అందించి సంరక్షిస్తున్నారు.
ఈ పక్షిని భారతీయ గుడ్లగూబ(బుబో బెంగలెన్సిస్), ఇండియన్ రాక్ ఈగిల్-ఔల్ అని పిలుస్తారు. చెవి భాగంలో కొమ్ముల్లా కనిపించే ఈకల కుచ్చులు ఉండడంతో తెలుగులో కొమ్ముల గుడ్లగూబగా ప్రసిద్ధి చెందింది. రాతి ప్రాంతాలు, కొండలు, పొదల అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ప్రకాశవంతమైన నారింజ రంగు కళ్లు, గోధుమ, బూడిద రంగు మచ్చల ఈకలు ఈ పక్షికి ప్రత్యేక ఆకర్షణ.
వెలుగు ఫొటోగ్రాఫర్, వరంగల్
