వయనాడ్ ప్రమాదం.. గల్లంతైనోళ్ల కోసం గాలింపు

వయనాడ్ ప్రమాదం.. గల్లంతైనోళ్ల కోసం గాలింపు

వయనాడ్: కొండచరియలు విరిగిపడిన ఘటనలో గల్లంతైన ఐదుగురు టన్నెల్ నిర్మాణ కార్మికుల కోసం రెస్క్యూ టీమ్స్ విస్తృతంగా గాలిస్తున్నాయి. మట్టి దిబ్బల కింద చిక్కుకుపోయిన వారిని వెలికితీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వారిని గుర్తించడానికి శిక్షణ పొందిన కుక్కలు, ఫైర్ ఫోర్స్ సిబ్బంది, ఎన్‌డీఆర్‌‌ఎఫ్​బృందాలను రంగంలోకి దించామని తెలిపారు. 

గాలింపు చర్యలను వేగవంతం చేసేందుకు ప్రమాద స్థలాన్ని నాలుగు జోన్లుగా విభజించామని చెప్పారు. నది దిగువ ప్రాంతాల్లోనూ గాలింపు జరుపుతూనే, చూరల్మల వైపు వెళ్లే ప్రధాన రహదారిని పునరుద్ధరించామని పేర్కొన్నారు.