పండ్ల తోటలో నక్కిన టెర్రరిస్టు ఎన్కౌంటర్...జమ్మూలో లష్కరే ఉగ్రవాదిని మట్టుబెట్టిన పోలీసులు

పండ్ల తోటలో నక్కిన టెర్రరిస్టు ఎన్కౌంటర్...జమ్మూలో లష్కరే ఉగ్రవాదిని మట్టుబెట్టిన పోలీసులు
  •     అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టెర్రరిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్లలో భద్రతా దళాలు భారీ విజయాన్ని సాధించాయి. దక్షిణ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌లోని సైద్‌‌‌‌‌‌‌‌పొరాలో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ లష్కరే తోయిబా (ఎల్‌‌‌‌‌‌‌‌ఈటీ)కు చెందిన ఒక అనుమానిత ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది. 

స్పాట్‌‌‌‌‌‌‌‌లో టెర్రరిస్టు మృతదేహంతోపాటు భారీగా అత్యాధునిక ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐదు రోజుల క్రితం సైద్‌‌‌‌‌‌‌‌పొరా పరిధిలోని ఛానాపోరా ప్రాంతంలో లష్కరే తోయిబా కమాండర్ జాకీర్ గనాయ్, అతడి అనుచరుడు లతీఫ్ భట్ కదలికలను సీసీటీవీ కెమెరాలు రికార్డు చేశాయి. వారు సమీపంలోని పండ్ల తోటలోకి వెళ్లినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఉగ్రవాదుల ఉనికిపై కచ్చితమైన సమాచారం అందడంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్‌‌‌‌‌‌‌‌పీఎఫ్ బలగాలు కలిసి ఆపరేషన్ చేపట్టాయి.

రంగంలోకి దిగిన ‘విక్టర్ ఫోర్స్’ 

ఉగ్రవాదులు ఆ ప్రాంతం నుంచి తప్పించుకోకుండా ఉండేందుకు ఆర్మీకి చెందిన ప్రత్యేక కౌంటర్- ఇన్సర్జెన్సీ విభాగం ‘విక్టర్ ఫోర్స్’ రంగంలోకి దిగింది. తోట చుట్టూ ఉన్న అన్ని ఎగ్జిట్ రూట్లను పూర్తిగా బంద్ చేసింది. ఆ ప్రాంతమంతటా భారీ హై-బీమ్ లైట్లను ఏర్పాటు చేసింది. తీవ్రవాదులు దాక్కున్న స్థలానికి భద్రతా దళాలు  చేరువవుతుండగా వారు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఒక ఉగ్రవాది చనిపోయాడు.