36 ఏండ్ల తర్వాత వింబుల్డన్‌‌ జూనియర్స్‌‌ క్వార్టర్స్లోకి మనోడు..

36 ఏండ్ల తర్వాత వింబుల్డన్‌‌ జూనియర్స్‌‌  క్వార్టర్స్లోకి మనోడు..

లండన్‌‌: భారత యువ టెన్నిస్‌‌ ప్లేయర్​ అర్నవ్‌‌ పాపర్కర్ వింబుల్డన్‌‌ జూనియర్స్‌‌ బాయ్స్​ సింగిల్స్​లో చరిత్ర సృష్టించాడు. జపాన్‌‌కు చెందిన ర్యో టబాటాపై 6-–2, 6–-1తో విజయం సాధించి క్వార్టర్‌‌ ఫైనల్‌‌కు చేరాడు. దీంతో 36 ఏండ్ల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా అర్నవ్​ నిలిచాడు. చివరిసారిగా 1990లో భారత టెన్నిస్‌‌ దిగ్గజం లియాండర్‌‌ పేస్‌‌ ఈ దశకు చేరాడు.

ఐటీఎఫ్‌‌ జూనియర్‌‌ ర్యాంకింగ్స్​లో 19వ స్థానంలో ఉన్న 18ఏండ్ల అర్నవ్‌‌.. రెండోరౌండ్‌‌లో మూడో ర్యాంకర్‌‌ కీటన్‌‌ హాన్స్‌‌ (అమెరికా)ను 6-–2, 6–-3తో ఓడించి సంచలనం సృష్టించాడు. మహారాష్ట్రలోని హేమంత్‌‌ బెంద్రే టెన్నిస్‌‌ అకాడమీలో కోచ్‌‌ ప్రసోంజిత్‌‌ పాల్‌‌ అండర్​లో శిక్షణ పొందుతున్నాడు.

అర్నవ్‌‌కు మహారాష్ట్ర స్టేట్‌‌ లాన్‌‌ టెన్నిస్‌‌ అసోసియేషన్‌‌, మహాటెన్నిస్‌‌ ఫౌండేషన్‌‌ సపోర్ట్​ అందిస్తున్నాయి. భారత యువ టెన్నిస్‌‌ ప్లేయర్​ అర్నవ్‌‌ పాపర్కర్ వింబుల్డన్‌‌ జూనియర్స్‌‌ బాయ్స్​ సింగిల్స్​లో చరిత్ర సృష్టించాడు. జపాన్‌‌కు చెందిన ర్యో టబాటాపై 6-–2, 6–-1తో విజయం సాధించి క్వార్టర్‌‌ ఫైనల్‌‌కు చేరాడు.

దీంతో 36 ఏండ్ల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా అర్నవ్​ నిలిచాడు. చివరిసారిగా 1990లో భారత టెన్నిస్‌‌ దిగ్గజం లియాండర్‌‌ పేస్‌‌ ఈ దశకు చేరాడు. ఐటీఎఫ్‌‌ జూనియర్‌‌ ర్యాంకింగ్స్​లో 19వ స్థానంలో ఉన్న 18ఏండ్ల అర్నవ్‌‌.. రెండోరౌండ్‌‌లో మూడో ర్యాంకర్‌‌ కీటన్‌‌ హాన్స్‌‌ (అమెరికా)ను 6-–2, 6–-3తో ఓడించి సంచలనం సృష్టించాడు. మహారాష్ట్రలోని హేమంత్‌‌ బెంద్రే టెన్నిస్‌‌ అకాడమీలో కోచ్‌‌ ప్రసోంజిత్‌‌ పాల్‌‌ అండర్​లో శిక్షణ పొందుతున్నాడు. అర్నవ్‌‌కు మహారాష్ట్ర స్టేట్‌‌ లాన్‌‌ టెన్నిస్‌‌ అసోసియేషన్‌‌, మహాటెన్నిస్‌‌ ఫౌండేషన్‌‌ సపోర్ట్​ అందిస్తున్నాయి.