అథర్వా, ప్రీతి ముకుందన్, కయాదు లోహర్ లీడ్ రోల్స్‌లో ఆకాష్ బాస్కరన్ తెరకెక్కించిన చిత్రం ‘హృదయం మురళి’. ఫహాద్ ఫాజిల్ కీలక పాత్ర పోషించారు. తమన్ సంగీతం అందించడంతో పాటు కీలకపాత్రలో కనిపించారు.
మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈనెల10న తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్ ప్రెస్ మీట్‌లో హీరో అథర్వా మాట్లాడుతూ ‘అందరూ రిలేట్ చేసుకునే స్టోరీ ఇది. వన్‌సైడ్ లవర్స్ ఎక్కువ కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరి మనసుకు దగ్గరగా అనిపిస్తూ ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది’ అని చెప్పాడు.
ప్రీతి ముకుందన్ మాట్లాడుతూ ‘హృదయాన్ని హత్తుకునే ప్రేమకథ ఇది. రెండు గంటలపాటు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇందులో చాలా నోస్టాల్జిక్ మూమెంట్స్ ఉన్నాయి. అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం’ అని చెప్పింది.
ప్రేమ, స్నేహం గురించి చెప్పే అద్భుతమైన సినిమా ఇదని నటుడు సెల్వన్ చెప్పాడు. ‘నైంటీస్‌లో వచ్చిన 'హృదయం' ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో, 'హృదయం మురళి' కూడా అంత పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకముందని ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి శశి అన్నారు.
