శ్రీకాంత్, లయ జంటగా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’.. జులై 17న రిలీజ్

శ్రీకాంత్, లయ జంటగా ‘మిస్టర్ మిడిల్ క్లాస్’.. జులై 17న రిలీజ్

శ్రీకాంత్, లయ జంటగా నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్‌‌‌‌ మిడిల్ క్లాస్‌‌’. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు.  జీకే అండ్‌‌ సీఎన్‌‌ నిర్మిస్తున్నారు. ఇటీవల టీజర్‌‌‌‌ను విడుదల చేసిన మేకర్స్‌‌... బుధవారం మూవీ రిలీజ్‌‌ డేట్‌‌ను ప్రకటించారు.

జులై 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌లో శ్రీకాంత్‌‌ వెంకటేశ్వరస్వామి గెటప్‌‌లో కనిపించడం ఆకట్టుకుంది.  ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే మిడిల్ క్లాస్ స్టోరీ ఇదని, అందరూ కలసి ఎంజాయ్ చేసే ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌ అని మేకర్స్‌‌ ఈ సందర్భంగా వెల్లడించారు.  ఇందులో సునీల్, రఘుబాబు, అలీ, వెన్నెల కిశోర్, పృథ్వీ, బాబూ మోహన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.