సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్, కనుకుల సర్పంచ్లు కర్రె గట్టయ్య, కర్రె కవిత కుమార్ తోపాటు పలువురు వార్డు మెంబర్లు, బీఆర్ఎస్ లీడర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. సుల్తానాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం వీరికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.100 కోట్లతో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుంచి కదంబాపూర్, కనుకుల గ్రామాల మీదుగా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి వరకు నిర్మించే తారు రోడ్డుతో పాటు పలు అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని సర్పంచులు కాంగ్రెస్లో చేరడం అభినందనీయమన్నారు. అంతకుముందు సుల్తానాబాద్‌లో రూ.10 లక్షలతో చేపట్టిన నాళాల పూడికతీత పనులు, సుగ్లాంపల్లిలో మహిళా గ్రామైఖ్య సంఘం భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ బి.రాధాకృష్ణ, వైస్ చైర్ పర్సన్ ఎ.పుష్పలత, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కమిషనర్ రమేశ్, కాంగ్రెస్ లీడర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు పాల్గొన్నారు.
