- గోదావరిఖనిలో ఎంపీ ఫొటోకు క్షీరాభిషేకం
గోదావరిఖని, వెలుగు: తాడిచర్ల బొగ్గు బ్లాక్ -2ను సింగరేణి సంస్థకు కేటాయించడంలో విశేష కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం గోదావరిఖని చౌరస్తాలో ఆయన ఫొటోకు కాంగ్రెస్ లీడర్లు క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచారు.
సింగరేణి సంస్థ పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమం కోసం ఎంపీ వంశీకృష్ణ కృషి చేస్తున్నారని లీడర్లు కొనియాడారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఎంపీకి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ సీనియర్లీడర్కామ విజయ్, లీడర్లు నరేందర్రెడ్డి, రఫీఖ్, శ్యామసుందరాచారి, హకీం తదితరులు పాల్గొన్నారు.
