కింగ్ నాగార్జున నటిస్తున్న ప్రతిష్ఠాత్మక 100వ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తమిళ దర్శకుడు రా. కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే టబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తుండగా.. తాజాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనే అంశం కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఓ టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు జోరుగా వినిపిస్తుండటం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.
నాగార్జున సెంటిమెంట్ రిపీట్?
కింగ్ నాగార్జున తన 100వ మైలురాయి చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారని టాక్. మన్మథుడు, మాస్, కింగ్, ఢమరుఖం వంటి సినిమాలకు డీఎస్పీ సంగీతం అందించి.. నాగ్కి సూపర్ సక్సెస్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే కింగ్ 100 మూవీకి కూడా దేవిశ్రీ ప్రసాద్ అయితేనే, సినిమాకు సాలిడ్ ట్యూన్స్ పడతాయని భావిస్తున్నాడట నాగ్. అయితే, ఇప్పటివరకు ఈ విషయంలో నాగ్ నుంచి ఎలాంటి అప్డేట్ రానప్పటికే.. డీఎస్పీ కన్ఫామ్ అని మాత్రం అని టాక్ వినిపిస్తోంది.
నాగార్జునను ఢీకొట్టబోతున్న టబు..
నాగార్జున, టబు కాంబినేషన్ అనగానే ‘నిన్నే పెళ్లాడతా’ లాంటి సూపర్ హిట్ మూవీ గుర్తొస్తుంది. సిసింద్రీ, ఆవిడా మా ఆవిడే లాంటి చిత్రాల్లోనూ కలిసి కనిపించిన ఈ జంట.. దాదాపు మూడూ దశాబ్ధాల తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. నాగార్జున హీరోగా తమిళ దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కిస్తున్న చిత్రంలో టబు నటిస్తోంది.
నాగార్జున కెరీర్‌లో ఇది 100వ సినిమా కావడంతో హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ నెలకొన్నాయి. ఇక నాగ్‌కు హిట్ పెయిర్‌గా అలరించిన టబు.. ఈ సినిమాలో మాత్రం పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించబోతున్నట్టు సమాచారం. నాగార్జున, టబు మధ్య రాబోయే సీన్స్ సినిమాకు మేజర్ హైలైట్స్‌గా ఉండబోతున్నాయట. ఇలా నెగెటివ్, డార్క్ షేడ్స్ ఉండే పాత్రల్లో నటించడం టబుకు కొత్తేమీ కాదు.
అంధాధూన్, మఖ్బూల్, హైదర్, ఫితూర్ లాంటి సినిమాల్లో గ్రే షేడ్స్ ఉండే క్యారెక్టర్స్‌లో తనదైన నటనతో ఆమె మెప్పించారు. ఇక ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ చిత్రం ఎనభై శాతం వరకూ షూటింగ్ పూర్తయింది. జులై 10 తర్వాత ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఉంటుందని ఇటీవల ‘లెనిన్’ ఈవెంట్‌లో నాగార్జున వెల్లడించారు.
సీక్రెట్‌గా సాగుతున్న షూటింగ్..
ఇకపోతే, ‘నాగ్ 100’ సినిమా అనగానే.. డైరెక్టర్గా కార్తీక్, విలన్గా టబు అని మాత్రమే ఆడియన్స్కు తెలుసు. మిగతా ఏ విషయాల్లో లీకులు లేవు. షూటింగ్ పూర్తయ్యే వరకు సినిమాకు సంబంధించిన కీలక వివరాలు బయటకు రాకుండా నాగార్జున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ కూడా షూటింగ్ మరియు సినిమా జానర్ గురించి అత్యంత సీక్రెట్ మెయింటేన్ చేస్తూ వస్తుంది. షూటింగ్ పూర్తయ్యాక భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించాలనే ప్లాన్‌లో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా సందర్భంగా లేదా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అభిమానులు ఎదురుచూస్తున్న అధికారిక అప్డేట్ త్వరలోనే రానుంది.
