సేఫ్టీ క్లియరెన్స్ వచ్చింది.. 118 జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు మళ్లీ రోడ్డెక్కాయ్ 

సేఫ్టీ క్లియరెన్స్ వచ్చింది.. 118 జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు మళ్లీ రోడ్డెక్కాయ్ 

హైదరాబాద్ నగరంలో 118 జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు మళ్లీ రోడ్డెక్కాయ్. బ్యాటరీ ప్రాబ్లమ్స్ తో వారం రోజుల పాటు నిలిపివేసిన జేబీఎం ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ దశలవారీగా తిరిగి ప్రారంభిస్తోంది. ఈ క్రమంలో బుధవారం మరో 118 బస్సులకు ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇచ్చింది. 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్నికల్ టీం చెక్ చేసిన అనంతరం మొత్తం 118 బస్సులు సర్వీస్ అందించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 500 జేబీఎం బస్సులను టీజీఎస్ ఆర్టీసీ నడుపుతుంది. 

ఇప్పటికే 150 బస్సులకు అనుమతివ్వగా తిరిగి సేవలోకి వచ్చాయి. తాజా అనుమతులతో మొత్తం 268 బస్సులు ఇప్పుడు తిరిగి రోడ్లపైకి వచ్చాయి. కాగా మిగిలిన బస్సులు సెక్యూరిటీ చెకింగ్స్ పూర్తయిన రాబోయే తిరిగి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 
ఇదిలా ఉంటే జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులు ఇంకా అందుబాటులో లేని మార్గాల్లో అదనపు బస్సు సర్వీసులను నడపాలని ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూడాలని టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై నాగిరెడ్డి అన్ని ప్రాంతాల రీజినల్ మేనేజర్లను ఆదేశించారు.