సంజూను ఎందుకు తీసుకోలేదంటే?.. గంభీర్ వ్యాఖ్యలపై నెట్టింట రచ్చ రచ్చ! 

సంజూను ఎందుకు తీసుకోలేదంటే?.. గంభీర్ వ్యాఖ్యలపై నెట్టింట రచ్చ రచ్చ! 

Gautam Gambhir: జింబాబ్వే టూర్‌కు ప్రకటించిన భారత జట్టులో సంజూ శాంసన్ పేరు లేకపోవడం, ఆపై ఇంగ్లాండ్‌తోని జరిగిన మూడో టీ20లో కూడా అతన్ని పక్కన పెట్టడంపై సోషల్ మీడియాల ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తుండ్రు. వరల్డ్ కప్‌ టోర్నీల కిరాక్ గా ఆడిన ప్లేయర్‌ను.. కేవలం మూడు మ్యాచ్‌లల్లా ఫెయిల్ అయిండని పక్కన పెట్టడం ఏందిరభై అంటూ సెలెక్టర్లను నెటిజన్లు గట్టిగనే ఏకిపారేస్తుండ్రు. అసలు సంజూను డ్రాప్ చేసిండ్రా లేక రెస్ట్ ఇచ్చిండ్రా అనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో ఈ కొట్లాట మరింత ఎక్కువైంది. కాగా ఈ సస్పెన్స్‌పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంజూ మ్యాటర్‌పై తొలిసారి నోరు విప్పిండు.

ఆ ముచ్చట మా ఇద్దరి మధ్యనే ఉంటది: గౌతమ్
ప్రెస్ కాన్ఫరెన్స్‌ల గంభీర్ మాట్లాడుతూ.. తాను సంజూ శాంసన్‌తో పర్సనల్‌గా మాట్లాడి ఎలాంటి క్లారిటీ కావాలో, అది నేను ఆల్రెడీ అతడికి చెప్పేసిన.. ఆ డిస్కషన్ కేవలం కోచ్, ప్లేయర్ మధ్య మాత్రమే ఉంటది.. వరల్డ్ కప్‌ల సంజూ ప్రదర్శన అద్భుతమనే దాంట్ల మాకు పూర్తి స్పష్టత ఉంది.. కానీ, కొన్నిసార్లు ఆటగాడి కరెంట్ ఫామ్‌ను కూడా చూసుకోవాలి కదా అని పేర్కొన్నాడు. 

ఇంగ్లాండ్ సిరీస్‌లనే సంజూ కమ్‌బ్యాక్?: గంభీర్
ఈ సిరీస్‌లో సంజూ శాంసన్ మళ్లీ కమ్‌బ్యాక్ చేయలేడనే కఠినమైన రూల్స్ ఏవీ లేవు.. అంతిమంగా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఫలితాలే ముఖ్యం.. ఏ కాంబినేషన్ జట్టుకు విజయాన్ని అందిస్తుందో దాన్నే ఆడిస్తాం.. దేశం కోసం ఆడాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి తమ స్థానాన్ని సంపాదించుకోవాల్సిందే అని గంభీర్ స్పష్టం చేసిండు. 

సంజూ వస్తే ఎవరు చోటు కోల్పోతారు:
సంజూ ప్లేస్‌లో అరంగేట్రం చేసిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఆడిన రెండు మ్యాచ్‌లల్లా పెద్దగా రాణించలేదు. అయినప్పటికీ, కేవలం రెండు మ్యాచ్‌ల ఆధారంగానే అతడిని జట్టు నుంచి వెంటనే తీసేసే ఛాన్సులు తక్కువగనే ఉన్నాయి. ఒకవేళ శాంసన్‌ను మిడిల్ ఆర్డర్‌ల ఆడించాలనుకుంటే.. ప్రస్తుతం ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న తిలక్ వర్మపై వేటు పడేలా కనిపిస్తోంది. తిలక్ ప్రస్తుతం లోయర్ ఆర్డర్‌ల ఆడుతుండడు, ఆ పొజిషన్‌ల ఆడడం సంజూకు అలవాటే.