రూల్స్ మార్చడం, మోసం చేయడం అమెరికాకు అలవాటే.. ఫిఫాపై ఇరాన్ అధ్యక్షుడి ఫైర్!

రూల్స్ మార్చడం, మోసం చేయడం అమెరికాకు అలవాటే.. ఫిఫాపై ఇరాన్ అధ్యక్షుడి ఫైర్!

FIFA World Cup Controversy: ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ స్టేజ్ మ్యాచ్‌లు ఒకవైపు హోరాహోరీగా కొనసాగుతుంటే, మరోవైపు వివాదాలు టోర్నమెంట్‌ను చుట్టుముడుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్.. టోర్నమెంట్ హోస్ట్ దేశమైన అమెరికాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరల్డ్ కప్ వేదికగా అమెరికా రూల్స్ మారుస్తూ, ప్రత్యర్థులను బెదిరిస్తూ, మోసాలకు పాల్పడుతోందని సంచలన ఆరోపణలు చేశారు.

మోసం చేయడం అమెరికాకు అలవాటే: 
ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ ఎక్స్ (X)లో పెట్టిన ఒక పోస్ట్‌లో.. అమెరికా విదేశాంగ విధానాన్ని (Foreign Policy), ఈ వరల్డ్ కప్ వివాదాలను లింక్ చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. వరల్డ్ కప్ హోస్ట్‌గా యూఎస్ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు.. దానికి అలవాటైన విదేశాంగ విధానం లాగే ఉందన్నారు. రూల్స్ మార్చడం, ప్రత్యర్థులను బెదిరించడం, అడ్డంకులు సృష్టించడం, మోసం చేయడం.. ఇదంతా వారి MAGA (Make America Great Again) ప్లేబుక్ లోని భాగమే అని ఆరోపించారు. ఇరాన్ ఇలాంటి ఆటలను అస్సలు ఒప్పుకోదు.. మా హక్కుల కోసం మేము గట్టిగా నిలబడతామన్నారు.  

ట్రంప్ ఫోన్ చేయగానే రూల్స్ మారుస్తారా?: ఇరాన్
ప్రస్తుతం వరల్డ్ కప్‌లో అమెరికాకు ఫేవరిజం జరుగుతోందనే ఆరోపణలకు ఫోలారిన్ బాలోగన్ వివాదమే ప్రధాన కారణం. రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినాతో జరిగిన మ్యాచ్‌లో బాలోగన్‌కు రెఫరీ రెడ్ కార్డ్ ఇచ్చాడు. రూల్స్ ప్రకారం అతడికి ఒక మ్యాచ్ సస్పెన్షన్ పడాలి..  కానీ, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఫిఫా ప్రెసిడెంట్ జియాని ఇన్ఫాంటినోతో మాట్లాడి ఆ సస్పెన్షన్‌ను రద్దు చేయించాడు. దీంతో ఫిఫా డిసిప్లినరీ కోడ్ ఆర్టికల్ 27 కింద ఆ సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ బాలోగన్ బెల్జియంతో మ్యాచ్ ఆడేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీనిపై యూరప్ ఫుట్‌బాల్ బోర్డ్స్ తీవ్రంగా మండిపడ్డాయి. 

ALSO READ : ట్రంప్ నోరు పారేసుకున్నాడు.. 

అర్జెంటీనా మ్యాచ్ వివాదమే దీనికి ఆజ్యం: 
రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లో ఈజిప్ట్ 3–2తో అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో ఈజిప్ట్ ప్లేయర్ మోస్తఫా జికో కొట్టిన గోల్‌ను VAR రివ్యూ ద్వారా 20 సెకన్ల ముందటి ఫౌల్ సాకుతో రద్దు చేశారు. దీనిపై ఈజిప్ట్ కోచ్ హసన్ తీవ్రంగా మండిపడుతూ.. ఫిఫా యాంటీ రేసిజం సిగ్నల్ అయిన ‘X’ గుర్తును చూపిస్తూ నిరసన తెలిపాడు. మెస్సి సేనకు అనుకూలంగా అంపైరింగ్ జరిగిందని ఈజిప్ట్ ఆరోపించింది.

ఫిఫా వరల్డ్ కప్ లో ఇరాన్ ఇబ్బందులు: 
ఇరాన్ జట్టు గ్రూప్ స్టేజ్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకపోయినా నాకౌట్స్‌కు క్వాలిఫై కాలేకపోయింది. టోర్నమెంట్ మేనేజ్‌మెంట్‌పై ఇరాన్ కెప్టెన్ మెహదీ తారెమి కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వీసా సమస్యలు, సెక్యూరిటీ రూల్స్ వల్ల ఇరాన్ జట్టును అమెరికా లోపల బేస్ క్యాంప్ పెట్టుకోనివ్వలేదు. దీంతో ఇరాన్ మెక్సికోలోని టిజువానా (Tijuana) లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని, మ్యాచ్ ఉన్న రోజు మాత్రమే అమెరికాకు వచ్చి, మ్యాచ్ కంప్లీట్ అవ్వగానే వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఈ ట్రావెల్ షెడ్యూల్ ఒక డిజాస్టర్ అని ఇరాన్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది. ఇప్పుడు ఈ క్రీడా వేదికగా అమెరికా వర్సెస్ ఇరాన్ మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతుంది.