అర్నబ్ ఎఫెక్ట్: తుఫాను హెచ్చరికలతో బెజవాడ దుర్గమ్మగుడి ఘాట్ రోడ్డు మూసివేత..

అర్నబ్ ఎఫెక్ట్: తుఫాను హెచ్చరికలతో బెజవాడ దుర్గమ్మగుడి ఘాట్ రోడ్డు మూసివేత..

ఏపీలో అర్నబ్ తుఫాను విరుచుకుపడనున్న క్రమంలో అప్రమత్తమైంది కూటమి ప్రబుత్వం. ఇప్పటికే తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని భావిస్తున్న జిల్లాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. తుఫాను హెచ్చరికల కారణంగా బెజవాడ దుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డు మూసివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. మంగళవారం ( అక్టోబర్ 27 ) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

​ఘాట్ రోడ్డుపై రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. వర్షాల సమయంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. ​ఈ సందర్భంగా ఈవో వి.కె. శీనానాయక్ మాట్లాడుతూ.. క్షేత్రానికి విచ్చేసే భక్తులకు ఘాట్ రోడ్డు వైపు అనుమతి లేదని, శ్రీ అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల రాకపోకలకు మహామంటపం మార్గాన్ని మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.  

►ALSO READ | అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్...ఏపీలోని ఈ జిల్లాల్లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు...

​వాతావరణ పరిస్థితులను బట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సేవలందిస్తారని, భక్తులందరూ ఈ మార్పును గమనించి ఆలయ భద్రతా సిబ్బందికి, అధికార యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఈవో శీనానాయక్.