Form 6ను మార్చలేదు.. SIR డిక్లరేషన్ వేరే డాక్యుమెంట్: సుప్రీం కోర్టుకు ఈసీ క్లారిటీ

Form 6ను మార్చలేదు.. SIR డిక్లరేషన్ వేరే డాక్యుమెంట్: సుప్రీం కోర్టుకు ఈసీ క్లారిటీ

SIR ప్రక్రియలో భాగంగా.. ఫారం 6 లో చేసిన సవరణలను సవాల్ చేస్తూ, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పనితీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాకేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఈసీ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకునే వాళ్లు నమోదు చేసుకోవడానికి ఉపయోగించే ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం 6ను తాము సవరించలేదని సుప్రీం కోర్టుకు ఈసీ వివరణ ఇచ్చింది.

SIR సమయంలో అదనపు డిక్లరేషన్ ఒక ప్రత్యేక పత్రమని ఎన్నికల సంఘం సోమవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే.. ఆన్‌లైన్‌లో ప్రకటనను ప్రదర్శించే విధానాన్ని ఒక సవరణగా భావించవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. అక్టోబర్ 21 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో ఈ రెండింటినీ వేరు చేశామని పేర్కొంది.

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో.. 1960 ఓటర్ల నమోదు నిబంధనల ప్రకారం నిర్దేశించబడిన ఫారం 6ను సవరించే అధికారం కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని ఈసీ స్పష్టం చేసింది. SIR డిక్లరేషన్ ఒక ప్రత్యేక పత్రమని, దానిని చట్టబద్ధమైన ఫారంలో పొందుపరచలేదని కూడా తెలిపింది. దరఖాస్తుదారులు వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP), e-sign ఉపయోగించి ప్రక్రియను పూర్తి చేయడానికి వీలుగా, ఆన్‌లైన్ దరఖాస్తు పోర్టల్‌లో ఫారం 6 పక్కన ఆ ప్రకటనను ప్రదర్శించారని ఎన్నికల కమిషన్ వివరించింది.

ఫాం6ను ఏ మాత్రం మార్చలేదని, కేంద్రం మాత్రమే మార్చగలదని, సర్ డిక్లరేషన్ వేరే డాక్యుమెంట్ అని కేంద్ర ఎన్నికల సంఘం మరోమారు స్పష్టం చేసింది. ఆన్ లైన్లో ఫాం6 సవరణ అయినట్లు కనిపించింది నిజమని, అక్టోబర్ 21 నుంచి ఫాం6, డిక్లరేషన్ వేరు చేశామని అత్యున్నత ధర్మాసనానికి కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.