హోటల్ రూంలోకి వెళుతూ కుప్పకూలిన బ్యాంక్ మేనేజర్ భార్య.. స్పాట్ డెడ్.. పెళ్లయి మూడు నెలలే..!

హోటల్ రూంలోకి వెళుతూ కుప్పకూలిన బ్యాంక్ మేనేజర్ భార్య.. స్పాట్ డెడ్.. పెళ్లయి మూడు నెలలే..!

ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఉన్న రిషభ్ హోటల్‌లో విషాదం జరిగింది. పెళ్లైన మూడు నెలలకే 28 ఏళ్ల ముస్కాన్ సిమౌలియా అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె భర్త, బ్యాంక్ మేనేజర్ అయిన నీలేష్‌ ఆమెను హత్య చేశాడని బాధితురాలి తండ్రి రామ్‌జీ లాల్ ఆరోపించాడు. అక్టోబర్ 24న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆ సమయంలో ఆమె తన భర్తతో కలిసి హోటల్ గదిలో ఉంది. భర్త చెప్పిన వివరాల ప్రకారం.. ఆమె హోటల్లో అకస్మాత్తుగా కుప్పకూలి మరణించింది. పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని, మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. ప్రస్తుతం సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఈ కేసు విచారణ జరుగుతోంది.

►ALSO READ | ఆన్‌లైన్ షాపింగ్ మోసం: రూ.700 చీర రిటర్న్ చేయబోయి రూ.లక్ష పోగొట్టుకున్న మహిళ!