తమిళ స్టార్ హీరో సూర్య ఈసారి రూటు మార్చారు. పోలీస్ యూనిఫామ్ వేసుకున్నారంటే పవర్‌ఫుల్ డైలాగులు, సీరియస్ ఇన్వెస్టిగేషన్‌తో అదరగొడతారని అనుకుంటున్నారు. అయితే ఆయన నటిస్తున్న 'సీన్'లో మాత్రం లెక్కలు వేరేలా ఉండబోతున్నాయి. మలయాళ దర్శకుడు జితు మాధవన్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి లేటెస్ట్ గా విడుదలైన గ్లింప్స్ ఇప్పుడు సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇందులో సూర్య కనిపించిన తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్, విచిత్రమైన ప్రశ్నలు చూస్తుంటే.. ఈసారి థియేటర్లలో సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయమనిపిస్తోంది.
ఆ పోలీస్ స్టేషన్‌లో అంతా వెరైటీనే..
ఈ చిత్రంలో సూర్య డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌గా కనిపించనున్నారు. ఓ క్రైమ్ సీన్ దగ్గరకు వచ్చిన ఆయన.. అక్కడి కానిస్టేబుల్‌ను 'ఎవరు ఎవరిని చంపారు?' అని చాలా క్యాజువల్‌గా అడుగుతారు. సాధారణంగా హత్య కేసు దర్యాప్తు చేసే పోలీస్ అధికారి సీరియస్‌గా వ్యవహరిస్తారు. కానీ ప్రేమ్‌రాజ్ తీరు మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఆయన ప్రవర్తన చూసి తోటి పోలీసులు సైతం ఆశ్చర్యపోయేలా ఉంది. నిందితులు ఆయన కస్టడీకి వెళ్లాలంటేనే భయపడతారని ఇతర పాత్రలు చెప్పడం ఈ క్యారెక్టర్‌పై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. అసలు ఇన్బరాజ్ అలా ఎందుకు ప్రవర్తిస్తాడు? అతడి దర్యాప్తు శైలి ఎలా ఉంటుంది? అన్నది తెరపై చూడాల్సిందే.
►ALSO READ | Weekend OTT Movies: ఓటీటీలోకి ఈ వీకెండ్ కొత్త సినిమాలు, సిరీస్‌లు.. ఆడియన్స్కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!
యాక్షన్.. డార్క్ కామెడీ..
'ఆవేశం' వంటి చిత్రంతో తనదైన శైలిని చాటుకున్న జితు మాధవన్.. ఈసారి క్రైమ్, యాక్షన్, డార్క్ కామెడీని కలిపి సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు గ్లింప్స్ సూచిస్తోంది. సూర్యకు జోడీగా నజ్రియా నజీమ్ నటిస్తుండగా, నస్లెన్, ఆనంద్‌రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుసిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్నారు.
వినీత్ అగస్టియన్ సినిమాటోగ్రఫీ, అజ్మల్ సాబు ఎడిటింగ్ ఈ చిత్రానికి సాంకేతికంగా కీలకం కానున్నాయి. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై జ్యోతిక, సూర్య నిర్మిస్తున్న ఈ సినిమా నవంబరు 6న దీపావళి సందర్భంగా థియేటర్లలోకి రానుంది. మరి ఈ విచిత్రమైన డీఎస్పీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి 'సీన్' క్రియేట్ చేస్తారో చూడాలి.
