అస్సాంలో కాల్పుల కలకలం.. గౌహతిలోని ఓ హోటల్‌లో నలుగురిని కాల్చి చంపిన దుండగుడు !

అస్సాంలో కాల్పుల కలకలం.. గౌహతిలోని ఓ హోటల్‌లో నలుగురిని కాల్చి చంపిన దుండగుడు !

గౌహతి: అస్సాంలోని గౌహతిలో ఒక హోటల్‌లో కాల్పులు కలకలం రేపాయి. గుర్తు తెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించారు. ఈ ఘటన ఉలుబారి ప్రాంతంలో జరిగింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హోటల్ బిలాస్ ఇన్‌ను ఆనుకుని ఉన్న సందులోని కళ్యాణ్ జ్యువెలర్స్ అవుట్‌లెట్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కాల్పులకు దారితీసిన పరిస్థితులు ఇంకా తెలియలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

సోమవారం రాత్రి సుమారు 10 గంటలకు కాల్పులు జరిగాయి. నాలుగు మృతదేహాలను పోస్ట్‌మార్టానికి పంపామని గౌహతి పోలీస్ కమిషనర్ పార్థ సారథి మహంత తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురు చనిపోయారు. కొందరు హోటల్ సిబ్బంది కూడా బాధితుల్లో ఉన్నారు.